షాకింగ్ : ఉగ్రవాదుల కాళ్ల కింద అమెరికా, యూకే, ఇజ్రాయిల్ జెండాలు

పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల రూపంలో రంగులు వేశారు. రోజూ వాటిపై నుంచి ఉగ్రవాదులు నడుస్తూ.. తమ పైశాచికత్వాన్ని పొందుతున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
2019, ఫిబ్రవరి 2వ తేదీ మంగళవారం తెల్లవారుజామున పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. ఈ సమయంలో కొన్ని ఫొటోలు తీశారు.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!
శాటిలైట్ ఆధారంగా ఆయా శిబిరాలను గుర్తిస్తూ.. వాయుసేనకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ఇది బయటపడింది. దీన్ని చూసి ఇండియన్ ఆర్మీ కూడా ఆశ్చర్యపోయింది. ఉగ్రసంస్థలు.. ఏ స్థాయిలో విద్వేషాన్ని నూరిపోస్తున్నారో అర్థం అవుతుంది. ఆయా ఉగ్ర శిబిరాల మెట్లపై, నడిచే మార్గంలో కాళ్ల కింద ఉన్న అమెరికా, ఇజ్రాయిల్, బ్రిటన్ జెండాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇండియా జాతీయ పతాకం మాత్రం కనిపించలేదు.
ఈ పరిస్థితులు చూస్తుంటే.. ఆయా దేశాలపై దాడులకు కూడా బాల్ కోట్ ఏరియా నుంచే వ్యూహాలు రచిస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అసలు జైషే ఉగ్రస్థావరాల్లో ఆ దేశ జాతీయ జెండాల పెయింటింగ్ లు ఎందుకు ఉన్నాయి? ఆయా దేశాల నుంచి ఉగ్రవాదులకు ఏమైనా పరోక్ష సహకారం అందుతుందా? ఉగ్రవాదులు ఆ దేశాలను టార్గెట్ చేశారా? ఇలా అందరిలో అనేక సందేహాలు మొదలయ్యాయి.
Also Read : బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు
ప్రధానంగా ఇజ్రాయెల్ జాతీయ జెండా పెయింటింగ్ అక్కడ ఉండటం ఇప్పుడు అందరిలో టెన్షన్ పుట్టిస్తుంది. పాక్ తో భారత్ యుద్ధానికి దిగితే.. మొదటగా భారత్ కు మద్దతునిచ్చేది ఇజ్రాయిల్. అలాంటి ఇజ్రాయెల్ పెయింటింగ్ ఉగ్ర శిబిరంలో దర్శనమివ్వడం అనుమానాలకు తావిస్తోంది. భారత్ కు ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన మిత్రపక్షం అనే వాస్తవం కాదలేనిది. అయినప్పటికీ ఈ సందేహాలు ఎవరు క్లారిటీ ఇస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Also Read :అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు