China Floods : చైనాలో వరదలు బీభత్సం..302 మంది మృతి
చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో సుమారు 302 మంది మృతి చెందారు.

Floods In China
Floods China : చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో సుమారు 302 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా గల్లంతయ్యారు. గత 60 ఏళ్లలో లేనంతగా రికార్డుస్థాయిలో కుంభవృష్టిగా వర్షం పడటంతో వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
వరదల కారణంగా దాదాపు 11.3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. వరదల ధాటికి హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ జౌలో ఏడు మంది మరణించారని, ముగ్గురు గల్లంతయ్యారని తెలిపారు. పింగ్ డింగ్ షాన్ నగరంలో ఇద్దరు, లూహే నగరంలో ఒకరు మృతి చెందారు.