Pak PM Shehbaz Sharif : ‘భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ తన ప్రసంగాన్ని అడ్డుకున్నవారిని సముదాయించిన పాక్ ప్రధాని

‘కాసేపట్లో భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ అంటూ తన ప్రసంగాన్ని అడ్డుకున్నవారిని పాక్ ప్రధాని సముదాయించారు,

Pak PM Shehbaz Sharif : ‘భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ తన ప్రసంగాన్ని అడ్డుకున్నవారిని సముదాయించిన పాక్ ప్రధాని

Food will be served soon, says Pakisthan PM shehbaz sharifs

Updated On : December 28, 2022 / 12:20 PM IST

Pakisthan PM Shehbaz Sharif:  ‘భోజనం పెడతారు కూర్చోండి కూర్చోండి’ అంటూ పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ తన ప్రసంగాన్ని అడ్డుకుని కేకలు వేస్తున్నవారిని సముదాయించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. సోమవారం (డిసెంబర్26,2022) ఖైబర్‌ ఫక్తుంక్వా ప్రావిన్సులోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశంలో అభివృద్ది ప్రాజెక్టుల గురించి ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది ప్రేక్షకులు నిలబడి కేకలు వేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నాడు. దీంతో ప్రధాని చిరునవ్వుతో ‘కాసేపట్లో భోజనం వడ్డిస్తారు కూర్చోండి కూర్చోండి’అంటూ సముదాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అభివద్ది గురించి మాట్లడుతుండగా ఓ వ్యక్తి కేకలు వేయటం..దానికి ప్రధాని భోజనం కాసేపట్లోనే పెడతారు కూర్చోండి కూర్చోండి అంటూ సముదాయించారు. ఆ తరువాత ఆయన తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన చేయటానికి ప్రధాని షరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. ఈక్రమంలో ఓ వ్యక్తి అడ్డుకోవటం ప్రధాని భోజనం పెడతారు అని కాస్త వ్యంగ్యంగా వారింటం విమర్శలకు దారి తీసింది.