Chile Former President Dies: చిలీలో హెలికాప్టర్ ప్రమాదం.. మాజీ అధ్యక్షుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు
లాగో రాంకో పట్టణానికి సమీపంలోని సరస్సు నుంచి మాజీ సెబాస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా తెలిపారు

Chile Ex-President Sebastian Pinera
Helicopter Crash: చిలీ దేశంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా మృతి చెందాడు. నలుగురు వ్యక్తులతో కలిసి పినేరా ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో ఆయన మృతిచెందగా, మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. మరోవైపు సెబాస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. పినేరా మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : 6 నెలల జైలు శిక్ష, రూ.25వేలు జరిమానా.. సహజీవనం చేసేందుకు కొత్త రూల్స్..! ఎక్కడో తెలుసా
లాగో రాంకో పట్టణానికి సమీపంలోని సరస్సు నుంచి మాజీ సెబాస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా తెలిపారు. ఇదిలాఉంటే.. పినేరా మృతి పట్ల అధ్యక్షుడు గ్రాబియేల్ బోరిక్ మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా మొదట 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశం అధ్యక్షుడిగా ఉన్నారు. బిలియనీర్ అయిన ఆయన చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు.
https://twitter.com/David_Cameron/status/1755001921587277865