Hyderabad Students: వరల్డ్ టీన్ పార్లమెంట్‌కు ఎంపికైన హైదరాబాద్ స్టూడెంట్లు
వరల్డ్ టీన్ పార్లమెంట్ అనే యునెస్కో సపోర్టెడ్ వ్యవస్థకు ఎంపీలుగా ఎమ్మెస్ క్రియేటివ్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

World Parliament
Hyderabad Students: వరల్డ్ టీన్ పార్లమెంట్ అనే యునెస్కో సపోర్టెడ్ వ్యవస్థకు ఎంపీలుగా ఎమ్మెస్ క్రియేటివ్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అమీనా అజీజ్, అతికా అమూదీ, మరియ ఖలీద్ సాచె, సుమేరా ఉమ్మే కుల్సుం అనే పదో తరగతి విద్యార్థులు ఎంపికయ్యినట్లుగా ఎమ్మెస్ ఎడ్యుకేషన్ అకాడమీ సీనియర్ డైరక్టర్ మొహమ్మద్ మొజమ్ హుస్సేన్ చెప్పారు.
మూడు దశలుగా జరిగిన ఎంపిక ప్రక్రియలో వీరే విజేతలుగా నిలిచారని హుస్సేన్ వివరించారు. ఈ నలుగురు ఎంపీలను లైఫ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పాలసీ మేకింగ్, గ్లోబల్ గవర్ననెన్స్ తో పాటు ఓటింగ్ ఎలా వేయాలి అనే విధానం పట్ల పూర్తి శిక్షణ ఇస్తారు.