Military Helicopter Crash : కుప్పకూలిన ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్…నలుగురి గల్లంతు
ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతు అయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్య తీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ నీటిలో మునిగిపోయింది. దీంతో నలుగురు ఎయిర్ క్రూ సిబ్బంది అదృశ్యమయ్యారని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ శనివారం తెలిపారు.....

Military Helicopter Crash
Military Helicopter Crash : ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతు అయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్య తీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ నీటిలో మునిగిపోయింది. దీంతో నలుగురు ఎయిర్ క్రూ సిబ్బంది అదృశ్యమయ్యారని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ శనివారం తెలిపారు. (Australian Military Helicopter Crash)
Telangana floods : తెలంగాణలో వరదల ధాటికి 18 మంది మృతి, మరో 12మంది గల్లంతు
శుక్రవారం అర్ధరాత్రి క్వీన్స్ ల్యాండ్ లోని హామిల్టన్ ద్వీపంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో నలుగురు ఎయిర్ క్రూ ఉద్యోగులు గల్లంతు అయ్యారు. (4 Missing) సమాచారాన్ని వారి కుటుంబాలకు అందజేశామని అధికారులు చెప్పారు.
జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియాకు చెందిన సైనికులు పాల్గొన్న ఈ విన్యాసాలను ప్రమాదంతో నిలిపివేశారు. ఆస్ట్రేలియా సాయుధ బలగాలను బలోపేతం చేసింది. చైనా వంటి శత్రు దేశాలను ఆమడదూరంలో ఉంచేలా ఆర్మీ సామర్ధ్యాన్ని పెంపొందించుకుంది.