Telangana floods : తెలంగాణలో వరదల ధాటికి 18 మంది మృతి, మరో 12మంది గల్లంతు

తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. వరదల్లో 30 మంది కొట్టుకుపోగా, 18 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట మునిగాయి...

Telangana floods : తెలంగాణలో వరదల ధాటికి 18 మంది మృతి, మరో 12మంది గల్లంతు

Telangana floods

Telangana floods : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. వరదల్లో 30 మంది కొట్టుకుపోగా, 18 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట మునిగాయి. జంపన్న వాగులో కొట్టుకు పోయి 8 మంది మరణించారు. (floods in Telangana) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిని వరదనీరు ముంచెత్తింది. జంపన్న వాగుపై వంతెన వరదనీటి ధాటికి కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Pakistan University : పాక్ యూనివర్శిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు…వెలుగుచూసిన షాకింగ్ వీడియోలు

గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లా సిరాల చెరువుకు గండి పడటంతో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ మోయతుమ్మెద వాగు వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భద్రాచలం వద్ద వరదనీటి మట్టం 53.1 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.

Anju-Nasrullah love story : అంజూ-నస్రుల్లా ప్రేమకథలో బిగ్ ట్విస్ట్…అంజూకు పాక్ పౌరసత్వం

వరదల వల్ల తెలంగాణాలో 5.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో వరదల వల్ల ఇంకా 20 కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, నిజామాబాద్, కుమరం భీం అసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఐఎండీ ఆయా జిల్లాలకు శనివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.