బ్రేక్ డౌన్ అవుతోందని 2.4 కోట్ల రూపాయల కారును తగులబెట్టేసాడు

Rassia : రష్యాకు చెందిన ఓ యూట్యూబర్ ఎంతో ముచ్చటపడి ఓ కాస్ట్లీ కారు కొన్నాడు. ఆ కారుమీద ఝాం ఝామ్మంటూ దూసుకుపోయేవాడు.అలా ఓ సారి వెళుతుండగా కారు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో అతనికి మండిపోయింది. ఇంత ముచ్చటపడి కారు రూ.2కోట్లకు పైగా పెట్టి కొన్నాను. బ్రేక్ డౌన్ అయిపోయి నా పరువు తీస్తోంది అంటూ కారుమీద మండిపడ్డాడు. డీలర్ దగ్గరకు తీసుకెళ్లి ‘‘ఏంటీ నాకీ తిప్పలు? ఎక్కడపడితే అక్కడ ఆగిపోతోంది. నా పరువు తీస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదారుసార్లు ఆ కారు ఆగిపోవటంతో ఒళ్లు మండి కారుని తగులబెట్టేశాడు…!!
వివరాల్లోకి వెళితే..రష్యాకు చెందిన మైఖేల్ లిట్విన్ అనే వ్యక్తి యూట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ యూట్యూబర్లలో లిట్విన్ ఒకడు. అతని వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. చాలామంది వ్యూయర్స్ ఉన్నారు. మైఖేల్ అప్ లోడ్ చేసే వీడియోల కోసం ఎంతో ఎగ్జైయిటింగ్ గా ఎదురు చూస్తుంటారు.
https://10tv.in/4-killed-one-injured-car-accident-near-rompicherla-major-canal-guntur-district/
అలా పెద్ద ఫేమస్ అయిపోయాడు మైఖేల్. అతడు ఇటీవల ఎంతో ఇష్టపడి రూ.2.4 కోట్లు పెట్టి ఓ మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నాడు. కానీ ఆ కారు తరుచూ బ్రేక్‌డౌన్ అవుతూ లిట్విన్ కు ఇరిటేషన్ కు గురిచేసేది. బ్రేక్ డౌన్ అయిన ప్రతీసారి తనకు కారు అమ్మిన డీలర్ వద్దకు తీసుకెళ్లేవాడు. ఆయనేమో రెండు రోజులు ఉంచుకుని తిరిగి ఇస్తున్నాడు. కానీ కొన్ని రోజులకు సీన్ రిపీట్..మళ్లీ బ్రేక్ డౌన్ అయిపోయేది. అలా ఐదు సార్లు ఆగిపోయేది. దీంతో మైఖేల్ ఇది కారు కాదు నా పాలిట ఇరిటేషన్ కు గురయ్యేవాడు.
ఎన్ని సార్లు రిపేర్ చేయించినా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మైఖఏల్ లిట్విన్‌కు ఒళ్లు మండిపోయింది. కారును కాల్చేయలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఏమాత్రం ఆలోచించలేదు ఆ కారుని ఓ విశాలమైన మైదానంలోకి తీసుకెళ్లి కారులో తెచ్చిన పెట్రోల్‌ను మొత్తం కారుమీద పోసి.. నిప్పు పెట్టేశాడు.
ఇంకేముంది కారు భగభగా మండిపోతోంది. కారు బూడిదవుతుంటే సినిమాలో హీరోలా చిప్స్ తింటు కెమెరా ముందు ఫోజులు కొట్టాడు. అదంతా వీడియో తీశాడు. ఈ వీడియోను YouTube లో పోస్ట్ చేసి మిలియన్స్‌లో వ్యూయర్స్ సంపాదించాడు.
అనంతరం, పాత కాలం నాటి కారులో ఇంటికెళ్లిపోయాడు. ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏమిటంటే..రూ.2.4 కోట్ల ఖరీదైన కారు ట్రబుల్ ఇస్తుందని మెర్సిడెజ్‌ను కాల్చేసి..ఎవరోకరు నెడితే కానీ స్టార్ట్ కాని పాతకాలం నాటి కారును.. ఓ నలుగురిని పిలిచి మరీ స్టార్ట్ చేయించుకుని మరీ వెళ్లాడు మైఖేల్ లిట్విన్. కారు కాల్చేయటం ఓ ట్విస్ట్ అయితే పాతకాలం కారును నెట్టించుకుని వెళ్లటం మరో ట్విస్ట్.
అంత ఖరీదైన కారును అలా కాల్చేయకపోతే ఆ పాతకాలంనాటి కారుని నెట్టించుకున్నట్లుగా నెట్టించుకుని ఆ కారుని వాడుకోవచ్చుకదాని కొంతమంది నెటిజన్లు సలహా ఇస్తున్నారు. మరికొందరేమో..ఏముందిలే వీడియోలతో వచ్చిన డబ్బులతో మరో కారు కొనుక్కోమని సలహాలిస్తున్నారు.