Gal Gadot : షూటింగ్ స్పాట్‌లోనే పాలిచ్చిన హీరోయిన్

ఆమె ఓ ప్రముఖ హీరోయిన్. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటుంది. ఎక్కువ సేపు షూటింగ్ లోనే గడపాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉండేది చాలా తక్కువ. అయినప్పటికి ఆమె

Gal Gadot : షూటింగ్ స్పాట్‌లోనే పాలిచ్చిన హీరోయిన్

Gal Gadot

Updated On : August 18, 2021 / 6:38 PM IST

Gal Gadot : ఆమె ఓ ప్రముఖ హీరోయిన్. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటుంది. ఎక్కువ సేపు షూటింగ్ లోనే గడపాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉండేది చాలా తక్కువ. అయినప్పటికి ఆమె తన తల్లి బాధ్యతను మరువలేదు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా తన పిల్లల కేరింగ్ తీసుకుంది. అందరికి ఆదర్శంగా నిలిచింది.

ఆమె హాలీవుడ్ భామ, వండర్ ఉమన్ ఫేమ్ గాల్ గాడోట్. నటిగానే కాదు తల్లిగానూ తన పాత్ర నిర్వర్తిస్తున్నారు గాల్ గాడోట్. ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్న ఆమె మేకప్ వేసుకునే సమయంలో తన బిడ్డకు పాలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తెరవెనుక తల్లిగా నా బాధ్యత అని కోట్ పెట్టారు.

Gal gadot

దీనిపై అభిమానులు స్పందించారు. గ్రేట్ మదర్, మల్టి టాస్కింగ్ ఉమెన్ అని గాల్ గాడోట్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ పెట్టారు. అటు వృత్తికి, ఇటు తల్లిగా.. రెండువైపులా న్యాయం చేస్తున్నారని కితాబిచ్చారు. షూటింగ్ కు అంతరాయం కలగకుండా, ఇటు పిల్లలకు ఇబ్బంది లేకుండా తన పాత్రను నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.

కాగా, జూన్ లో గాడోట్ 3వ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అయిన రెండు నెలలకే తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. డెత్ ఆన్ ద నైల్, రెడ్ నోటీస్, ద ఫ్లాష్ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలన్నీ రిలీజ్ కానున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Gal Gadot (@gal_gadot)