అమెరికా తగలబడటానికి కారణమైన మాజీ పోలీస్ కు బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : June 9, 2020 / 12:15 PM IST
అమెరికా తగలబడటానికి కారణమైన మాజీ పోలీస్ కు బెయిల్

Updated On : June 9, 2020 / 12:15 PM IST

మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌(46)”కి మద్దతుగా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు,ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య, జాత్యహంకారానికి నిరసనగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాట ర్స్‌ పేరుతో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల నిరసకారులు దుకాణాలు,వాహనాలకు నిప్పుపెట్టడం,షాపుల లూటింగ్ కు పాల్పడం వంటివి కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఫ్లాయిడ్ హత్యతో అగ్రరాజ్యాన్ని అతలాకుతలం అవుతున్న ఈ సమయంలో ఈ కేసులో దోషి అయిన మిన్నియాపోలిస్ సిటీ మాజీ పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌కి బెయిల్ లభించింది. 1.25మిలియన్ డాలర్లు(9కోట్ల 44లక్షలు)పూచికత్తుతో కోర్టు డెరెక్ చౌవిన్‌ కి షరతులు లేని బెయిల్‌ మంజూరు చేశారు. గత నెల 25న జరిగిన ఘటనలో చౌవిన్‌..జార్జ్ ఫ్లాయిడ్ మెడపై మోకాలుతో నొక్కి అతడి మరణానికి కారణమయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సోమవారం మిన్నెసోటా రాష్ట్ర కోర్టు… వీడియో ద్వారా చౌవిన్‌కు రెండవ డిగ్రీ హత్య, మూడవ డిగ్రీ హత్య, నరహత్య నేరాలకు శిక్ష విధించింది. అదే సమయంలో హెన్నెపిన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జెన్నిస్ రెడింగ్… చౌవిన్‌ కు షరతులుతో 1 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుతో, షరతులు లేకుండా 1.25 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో చౌవిన్‌తో పాటు అరెస్ట్ అయిన మరో ముగ్గురు పోలీసులపై హత్యకు సహకరించారనే అభియోగాలు మోపారు.

డెరెక్ చౌవిన్‌ దగ్గరున్న  ప్రభుత్వ ఆయుధాలను తిరిగి ఇచ్చేయడమే కాక.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సెక్యూరిటీ విభాగాల్లో పని చేయకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక ఫ్లాయిడ్‌ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

మరోవైపు,అమెరికాతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఫ్లాయిడ్‌ కు సంఘీభావంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లో పార్లమెంట్‌ స్క్వేర్‌ భవనంను కూడా ముట్టడించారు నిరసనకారులు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ లో కూడా జాత్యాహంకారానికి,వివక్షతకు వ్యతిరేకంగా, ఆందోళనలు జరుగుతన్నాయి.

Read: ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశ కోల్పోరాదు : సుందర్ పిచాయ్