Selfie With Dog : సెల్ఫీ దిగుతుండగా దాడి చేసిన కుక్క.. యువతికి తీవ్ర గాయాలు

సెల్ఫీ ఫోటో దిగాలన్న కోరిక ఓ బాలికను చిక్కుల్లో పడేసింది.. పెంపుడు కుక్కతో సెల్ఫీ దిగుతున్న సమయంలో దాడి చేయడంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది

Selfie With Dog : సెల్ఫీ దిగుతుండగా దాడి చేసిన కుక్క.. యువతికి తీవ్ర గాయాలు

Selfie With Dog

Updated On : December 17, 2021 / 12:21 PM IST

Selfie With Dog : ప్రస్తుతం సెల్ఫీల కాలం నడుస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే సెల్ఫీ, బాయ్ ఫ్రెండ్‌తో బయటకు వెళ్తే సెల్ఫీ.. ఏదైనా కొత్త సినిమాకి, కొత్త ప్రదేశానికి వెళ్తే ఓ సెల్ఫీ. ఇలా తమ ఫోన్లను సెల్ఫీలతో నింపేస్తున్నారు. అయితే కొందరు జంతువులతో సెల్ఫీలు దిగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలా దిగిన సెల్ఫీలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు.

చదవండి : Selfie Suicide : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్

అయితే 17 ఏళ్ల లారా సన్స్ నవ్వుతున్న జర్మన్ షెపర్డ్‌తో ఫొటో దిగుతుంది. మొదట్లో ఫోటోలకు ఫోజులిచ్చిన శునకం అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసింది. కుక్క దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువతి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట కూల్‌గా ఉన్న కుక్క.. ఒక్కసారిగా ఆమెపై దాడి చేయడంతో లారా సన్స్ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరుపులు విన్న స్నేహితులు పరుగున వచ్చి కుక్కను తరిమికొట్టాడు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించాడు. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు.

చదవండి : Selfie River : ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ మోజు, రాత్రంతా నదిలోనే..

ఇక ఇదే అంశంపై వెటర్నరీ వైద్యులు స్పందిస్తూ.. జంతువులూ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయో చెప్పడం కష్టమని తెలిపారు. బాలిక ఆ కుక్కకు విసుగుతెప్పించే పని చేసి ఉండొచ్చని తెలిపారు. ఇక కుక్క దాడితో లారా ముఖం అంద విహీనంగా తయారైంది. ప్రజలు ఇప్పుడు ఈ పోస్ట్‌ను హెచ్చరికగా షేర్ చేస్తున్నారు. ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా జంతువులకు మాత్రం దూరంగా ఉండాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.