Global Investors Meet 2022 : బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం ప్రారంభమైంది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

Global Investors Meet 2022 : బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Global Investors Meet 2022 In Karnataka

Updated On : November 2, 2022 / 11:56 AM IST

Global Investors Meet 2022 In Karnataka : ఈరోజు బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.మోడీ నవంబరు 2వ తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ఇతివృత్తంగా నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ఆసక్తిగల పెట్టుబడిదారులను ఆకర్షించడంతోపాటు రానున్న దశాబ్ద కాలంలో అభివృద్ధి సంబంధిత ప్రణాళిక రూపకల్పన లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటైంది. బెంగళూరులో నవంబర్ 2 నుంచి 4 వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 80కిపైగా ప్రసంగం చేయనున్నారు. ఈ సమావేశాల్లో ప్రసగించేవారిలో కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, విక్రమ్ కిర్లోస్కర్ వంటి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలున్నారు.

ఈ సదస్సులు భాగస్వామ్య దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాల ద్వారా నిర్వహించబడతాయి. దీంట్లో భాగంగా ఆయా దేశాల నుంచి మంత్రులు, పారిశ్రామికరంగ దిగ్గజాలు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతారు. దీనికి సంబంధించి లు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం తన సంస్కృతిని ప్రపంచానికి ప్రదర్శించనుంది.