Google Play Store: యాపిల్ బాటలో గూగుల్.. ప్లే స్టోర్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించేందుకు చర్యలు
వినియోగదారుల ప్రైవసీ కోసం ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లే స్టోర్‌లోని యాప్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించేందుకు సిద్ధమైంది. గూగుల్, ఆపిల్ తమ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నాయి...

Google Play Store: వినియోగదారుల ప్రైవసీ కోసం ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లే స్టోర్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించేందుకు సిద్ధమైంది. గూగుల్, ఆపిల్ తమ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నాయి. పాత యాప్‌లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో మార్పులు, కొత్త ఏపీఐలు భద్రతను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను ఉపయోగించుకోవడం లేదు. ఈ కారణంగా పాత యాప్‌లు భద్రత ఉండదు. మరో వైపు గూగుల్ ఇటీవల థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌లను నిషేధించింది. గత నెలలోనే అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా గత రెండేళ్లుగా యాప్స్ డెవలపర్లు ఎలాంటి అప్‌డేట్స్ చేయకపోవడంతోనే గూగుల్ ప్లే స్లోర్ నుంచి 9లక్షల యాప్ లను తొలగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Google Play Store : గూగుల్ నిషేధం ఈ రోజు నుంచే.. అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయవు..!
యాపిల్ గతంలో తన యాప్ స్టోర్ నుంచి 6.50లక్షలకు పైగా యాప్ లను తొలగించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని మూడింట ఒక వంతు యాప్‌లు సుమారు 8,69,000 యాప్‌లను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ రెండు దిగ్గజ కంపెనీలు కలిపి మొత్తం దాదాపు 15లక్షల యాప్ లు తొలగించనున్నాయి. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ లలో ఇక నుంచి తొలగించిన యాప్ లను డౌన్ లోడ్ చేసుకోలేరు. Google, Apple తమ యాప్ స్టోర్‌ల నుండి యాప్ లను తొలగించడానికి ప్రధాన కారణం వినియోగదారు డేటా రక్షణ ఒకటైతే, యాప్‌లకు సంబంధించిన సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఆయా యాప్‌ల డవలపర్స్ చేయకపోవడంకూడా ఒక కారణం.
యాప్‌లను కంపెనీల సూచనల మేరకు డవలపర్స్ అప్ డేట్ చేయకపోవటంతో వినియోగదారుడి డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కారణాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని యాపిల్, గూగుల్ సంస్థలు తమ ప్లే స్టోర్ నుంచి సుమారు 15 లక్షల యాప్ లను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలాఉంటే రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ Android 13, Google శోధన ఫీచర్‌లో మార్పులు, యుట్యూబ్‌కి ఫీచర్‌లను జోడించడం వంటి అనేక కొత్త విషయాలను కంపెనీ ప్రకటించింది. వీటితో పాటు కంపెనీ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా ప్రకటించింది. ఇది ఇంటర్నెట్ బ్రౌజర్, షాపింగ్ అనుభవాన్ని సురక్షితంగా చేస్తుంది.