రష్యన్ మిలిటరీకి గూస్ బంప్స్ తెప్పిస్తున్న మన దేశభక్తి గీతం

  • Published By: vamsi ,Published On : November 30, 2019 / 09:29 AM IST
రష్యన్ మిలిటరీకి గూస్ బంప్స్ తెప్పిస్తున్న మన దేశభక్తి గీతం

Updated On : November 30, 2019 / 9:29 AM IST

ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థలను కలిగి ఉన్న దేశాల్లో రష్యా ఒక్కటి. అటువంటి రష్యా మిలిటరీలో పని చేసేవారిలో స్పూర్తిని నింపేందుకు ఆ దేశ మిలిటరీ వ్యవస్థ మన భారతీయ సాంగ్‌ను వాడుకుంది.

1965లో బాలీవుడ్ సినిమా “షాహీద్” కోసం మొహమ్మద్ రఫీ రాసిన “హామ్ కో తేరి కసం” అంటూ సాగే దేశభక్తి పాటను రష్యన్ మిలిటరీ రష్యన్ యువ సైనికులు, వారి కుటుంబాలను ఉత్తేజపరిచేందుకు వినియోగించింది. 

ఈ దేశభక్తి సాంగ్ ఆలపిస్తూ రష్యన్ మిలిటరీ సభ్యులు పాటకు ట్యూన్ కలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో అక్కడ సీనియర్ భారత సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. ట్విట్టర్‌లో ప్రస్తుతం ఈ వీడియోని లక్షల మంది చూశారు.

మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో సైనిక సలహాదారు బ్రిగేడియర్ రాజేష్ పుష్కర్ కూడా వీడియోలో పాట పాడటం చూడవచ్చు. భారత్, రష్యా మధ్య స్నేహపూర్వక వాతావరణంను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రష్యన్ మిలటిరీకే కాదు పాట వింటున్నవారికి గూస్ బంప్స్ వచ్చేలా ఈ పాట ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.