ఫ్యూచర్‌లో ఇందనంగా హైడ్రోజన్‌.. గవర్నమెంట్ నయా ప్లాన్

ఫ్యూచర్‌లో ఇందనంగా హైడ్రోజన్‌.. గవర్నమెంట్ నయా ప్లాన్

Updated On : February 7, 2021 / 5:18 PM IST

Hydrogen As Fuel: పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వనరు వాడాలని ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు చేసింది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మరో అడుగు ముందుకేయనున్నారు. ఇక భవిష్యత్ మొత్తం ఇందనంగా హైడ్రోజన్ నే వాడాలని అనుకుంటున్నారు.

ఫ్యూచర్ లో ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను స్టేషనరీ ఛార్జర్‌తో నింపేందుకు హైడ్రోజన్ వాడనున్నారు. ఇలా చేయడం వల్ల కార్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవడమే కాకుండా.. కేవలం నీరు, వేడి మాత్రమే వాడి స్వచ్ఛమైన పద్ధతిలో వాహనాలను నడిపిస్తున్నారు.

వీటి వల్ల రెగ్యూలర్ బ్యాటరీ వెహికల్స్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. కార్ లోని ఇందనంగా.. హైడ్రోజన్ వాడి.. పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించొచ్చు. నేరుగా హైడ్రోజన్‌ను ఇందనంగా కార్లలోకి పంపేయొచ్చు. నిమిషాల్లో కార్ ఇందనాన్ని నింపేయొచ్చు. అదే బ్యాటరీతో ఛార్జింగ్ పెట్టాలంటే కొద్ది గంటల సమయం పడుతుంది.

ఈ మేరకు హ్యూండాయ్ మోటార్ కార్ప్,, చైనా ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది. చైనాలో ప్లాంట్ ఏర్పాటు చేసి విదేశాల్లో ఫ్యూయెల్ సెల్ సిస్టమ్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన తొలి విదేశీ సంస్థగా ఎదగాలనుకుంటుంది ఈ దక్షిణకొరియా కంపెనీ.