డెత్ మిస్టరీ : ఆ తర్వాత కూడా అలెగ్జాండర్ 6 రోజులు బతికే ఉన్నాడు

ప్రముఖుల మరణాలు మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. అందులో గ్రీకువీరుడు అలెగ్జాండర్ ఒకరు. ప్రపంచాన్ని జయించిన మహావీరుడు. అలెగ్జాండ్ డెత్ మిస్టరీ ఏమిటీ.. ఎలా మరణించాడు అనే ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్ సోకి మరణించాడని కొందరు.. లేదు మద్యపానం వల్ల అని ఇంకొందరు.. ప్లేగు వ్యాధితో చనిపోయాడని మరికొందరు.. ఇదేం కాదు విషమిచ్చి చంపారని మరికొందరు.. ఎవరేం చెప్పినా అదో మిస్టరీగానే ఉంది.
అలెగ్జాండర్ మరణం మరోసారి తెరపైకి వచ్చింది. కారణం. ఎప్పుడో 2వేల 300 ఏళ్లనాటి ఈ మిస్టరీని తాను ఛేదించానంటున్నారు న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీకి చెందిన పరిశోధకురాలు కేథరీన్ హాల్. అతని మరణం డేట్ కూడా కరెక్ట్ కాదంటున్నారు. క్రీ.పూ. 323 జూన్ 10న లేదా 11న అలెగ్జాండర్ చనిపోలేదట. ఆ ప్రకటనకు ముందే అంటే ఆరు రోజుల అనంతరం మరణించాడట. అంటే జూన్ 16న మరణించారనేది ఆమె లెక్క. అప్పుడు అలెగ్జాండర్ ని పరీక్షించిన వైద్యులు.. తప్పుడు నిర్ధారణ వల్ల బతికుండగానే చనిపోయినట్లు ప్రకటించారంటున్నారు కేథరీన్. సంచలనం రేకెత్తిస్తున్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ది ఏన్షియెంట్ హిస్టరీ బులెటిన్’లో ప్రింట్ అయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని..పరిశోధనను మనం కూడా తెలుసుకుందాం..
ఒటాగో వర్సిటీలోని డ్యూన్‌డిన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన సీనియర్ లెక్చరర్ కేథరీన్ హాల్. ఆమె చెప్పినదాని ప్రకారం.. అలెగ్జాండర్‌కు గులియన్ బారే సిండ్రోమ్ అనే వ్యాధి సోకింది. నరాలకు సంబంధించిన వైరస్. లక్ష మందిలో ఒకరికే వస్తుంది. ఈ వైరస్ అలెగ్జాండర్ కు ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. మెదడు పనిచేస్తుంది.. శరీరం చతికిల పడింది. చలనం లేదు. అందుకే అలెగ్జాండర్ చనిపోయాడనీ వైద్యులు ప్రకటించినట్లు కేథరిన్ తన పరిశోధనలో తేలిపింది. వాస్తవానికి అతడు బతికే ఉన్నాడు. చనిపోయాడని ప్రకటించిన తేదీ నుంచి ఆరు రోజుల తర్వాత అతను నిజంగా చనిపోయాడు అని చెబుతోంది.
శ్వాస ఆడుతోందా లేదా అన్నదే ప్రధానంగా చూసేవారు తప్ప.. పల్స్ (నాడి)ని పరీక్షించేవారు కాదు అప్పట్లో. గులియన్ బారే సిండ్రోమ్ వల్ల ఒళ్లంతా పక్షవాతం రావటంతో ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో అవసరం పడేది. దీని వల్ల శ్వాస తీసుకున్నా..దాన్ని నిర్ధారించేంత స్థాయిలో శ్వాస పసిగట్టటం కష్టం అయ్యింది. దీని వల్లే అలెగ్జాండర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారనేది కేథరీన్ వాదన. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతడి శరీరంలో ఎలాంటి మార్పు లేదు. కుళ్లిపోలేదు. దీంతో ప్రజలు కూడా ఆయన్ను మహిమగా చూసి అంత్యక్రియలు నిర్వహించలేదు అంటున్నారు ఆమె. చనిపోయారని నిర్ధారించిన 6 రోజుల వరకూ అతడి శరీరం పాడవ్వకుండా తాజాగానే ఉంది. దీనికి కారణం అప్పటికీ అలెగ్జాండర్ బతికి ఉండటమే.
గ్రీకులు దేవుడిగా భావించేవారు. ఆ మహిమ వల్లే అలెగ్జాండర్ శరీరం ఏమాత్రం పాడవ్వకుండా ఉందని పరిశోధనలో వెల్లడయ్యిందని కేథరీన్ అంటున్నారు. తన పరిశోధన కొత్త చర్చకు తెరలేపుతుందని..అవసరమైతే చరిత్ర పుస్తకాలను తిరగరాయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కేథరీన్ తాజా పరిశోధన ఇంకెన్ని చర్చలు, వివాదాలకు తెరలేపనుందో వేచి చూడాలి.