Happy Birthday PM Modi: పీఎం మోదీకి 71పూలతో బర్త్ డే విషెస్ తెలిపిన బంగ్లా ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు 2021 సెప్టెంబర్ 21న జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ..

Happy Birthday PM Modi: పీఎం మోదీకి 71పూలతో బర్త్ డే విషెస్ తెలిపిన బంగ్లా ప్రధాని

Pm Modi

Updated On : September 17, 2021 / 9:18 PM IST

Happy Birthday PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు 2021 సెప్టెంబర్ 21న జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. భారతదేశమంతటా ఈ ఒక్కరోజే 2కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ వేశారు. ఒక్కరోజులో అత్యధికంగా డోసులు వేసి రికార్డు నమోదుచేశారు.

మోదీకి దేశవ్యాప్తంగా ఈ గిఫ్ట్ ఇస్తే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మరో బహుమతిని 71వసంతాలకు చిహ్నంగా అందజేశారు. ఈ క్రమంలోనే 71 ఎర్ర గులాబీల పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. అంతేకాకుండా హిందోలో ప్రత్యేకమైన సందేశం కూడా పంపించారు.

‘ప్రధాని మోదీ మీ పుట్టినరోజు సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ తో పాటు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా’ అని రాసి పంపారు.

ఇండియా – బంగ్లాదేశ్ మధ్య 71కి ఒక ప్రాముఖ్యత ఉంది. భారతదేశ సహకారంతోనే 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. చివరిసారిగా ఇరుదేశాల ప్రధానులు కలిసినప్పుడు బంగ్లాదేశ్ గోల్డెన్ జూబ్లీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోదీకి ఆహ్వానం ఇచ్చారు. ప్రస్తుత సంవత్సరం వీరిద్దరూ న్యూయార్క్ వేదికగా మరోసారి కలిసే అవకాశాలు ఉన్నాయి.