ప్రపంచానికి బుద్దుడిని,శాంతిని ఇచ్చాం…ఉగ్రవాదం కాదు

  • Published By: venkaiahnaidu ,Published On : September 27, 2019 / 02:52 PM IST
ప్రపంచానికి బుద్దుడిని,శాంతిని ఇచ్చాం…ఉగ్రవాదం కాదు

Updated On : September 27, 2019 / 2:52 PM IST

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ…ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం నా ప్రభుత్వానికి,నాకు ఓటు వేసింది. మేము పెద్ద మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చాము. ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు…ఐక్యరాజ్యసమితి గోడలపై “ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదు” అని చదివాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని మేము భారతదేశంలో పెద్ద ప్రచారం నిర్వహిస్తున్నట్లు మీకు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశం… ప్రపంచంలోనే అతిపెద్ద శుభ్రత డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నప్పుడు, కేవలం 5 సంవత్సరాలలోపు 11 కోట్లకు పైగా మరుగుదొడ్లను తన ప్రజలకు అందించినప్పుడు.. ఆ వ్యవస్థ మొత్తం ప్రపంచానికి ప్రేరణ సందేశాన్ని ఇస్తుంది. 

ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికైనా సవాలు కాదని, అన్ని దేశాలకు, మొత్తం మానవాళికి సవాలు అని మేము నమ్ముతున్నాము. మానవత్వం కొరకు ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని మోడీ అన్నారు. భారత్ ప్రపంచానికి యుద్ధం ఇచ్చిన దేశం కాదని,బుద్దుడిని ఇచ్చిన దేశం అని ఆయన అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చామన్నారు. ప్రపంచ దేశాలు తమ తమ దేశాలకే పరిమితం కాకుడదన్నారు. ప్రపంచానికి శాంతి సామరస్యం చాలా అవసరమన్నారు. 

3000 సంవత్సరాల క్రితం భారతదేశపు గొప్ప కవి కనియన్ పుంగుంద్రనార్.. ప్రపంచంలోని పురాతన భాష తమిళ్ లో…యాధుమ్ ఓర్ యావరుమ్ కెలిర్(మేము అన్ని ప్రదేశాలకు బంధుత్వ భావనను కలిగి ఉన్నాము, ప్రజలందరూ మన సొంతం) అని అన్నారని మోడీ చెప్పారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు భారతదేశం అందించిన సహకారం అపారమైనదని, శాంతి పరిరక్షక కార్యకలాపాల కోసం భారతదేశం త్యాగం చేసినట్లుగా మరే ఇతర దేశం చేయలేదని అన్నారు. ఆరోగ్య రంగంలో భారతదేశం సాధించిన విజయాలను మోడీ వివరించారు, క్షయ నిర్మూలనకు భారతదేశం కట్టుబడి ఉందని చెప్పారు. వాతావరణ మార్పుపై భారత్ పోరాటాన్ని మోడీ తెలిపారు. 

ప్రజా భాగస్వామ్యంతో ప్రజా సంక్షమే తమ లక్ష్యమన్నారు. దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే అని అన్నారు. 2020నాటికి భారత్ లో పేదలకు మరో 2కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. 2025నాటికి భారత్ ను టీబీ రహిత దేశంగా మారుస్తామన్నారు. 50కోట్ల మందికి రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. అవినీతిని అడ్డుకోవడం వల్ల 20బిలియన్ డాలర్లు ఆదా అయ్యాయన్నారు. వచ్చే ఐదేళ్లలో 15కోట్ల గృహాలకు రక్షితనీరు అందిస్తామన్నారు