కరోనా సోకిన వృద్ధ దంపతులు ICUలో చివరి వీడ్కోలు : మనస్సుల్ని కలిచివేస్తున్న వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 10:33 AM IST
కరోనా సోకిన వృద్ధ దంపతులు ICUలో చివరి వీడ్కోలు : మనస్సుల్ని కలిచివేస్తున్న వైరల్ వీడియో

Updated On : February 7, 2020 / 10:33 AM IST

కరోనా వైరస్‌..సోకిన ఓ వృద్ధ దంపతులు ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూన్న దృశ్యం మనస్సుల్ని కలచివేస్తోంది. ‘‘ఇవే మన చివరి చూపులు..ఇదే ఈ జన్మకు ప్రాప్తం’’ అని చెప్పుకున్నారు. హాస్పిటల్ ఐసీయూ వార్డులో జరిగిన ఈ  వీడియో ఉన్న ఓ వీడియో మనస్సుల్ని కలచివేస్తోంది. 

కరోనా వైరస్‌ సోకిన ఓ వృద్ధ దంపతుల (80 సంవత్సరాలు పైబడిన దంపతులు) వీడియో వైరల్‌గా మారింది. ప్రాణాల మీద ఆశున్నా, బతుకుతామన్న నమ్మకం లేదన్న నిరాశ వారి కళ్లల్లో గోచరిస్తోంది. ప్రతిక్షణం ఒక యుగంలా బతుకు వెళ్లదీస్తున్న ఈ దంపతులు ఆసుపత్రిలో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. చేయి పట్టుకుని చివరిసారిగా భారంగా మాట్లాడుకున్నారు. 

‘వారు కలుసుకోవడం ఇదే చివరిసారేమో’ అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ హృదయ విదారక వీడియో నెటిజన్లు హృదయాలను కలిచివేస్తోంది.పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది.చాలావిషాదకరమైన వీడియో..కానీ ..జీవితపు చివరి క్షణాల్లోనూ వారి మధ్య ఉన్న ప్రగాఢ ప్రేమను ఎంతో హృద్యంగా ఉంది’, ‘వాళ్ల బాధను మనం ఊహించలేము, వాళ్లు తిరిగి కోలుకుంటే ఎంతో బాగుండు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

కాగా..కరోనా వైరస్ సోకిన వారు తాము బతుకుతామో లేదో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా వైరస్‌ వల్ల చైనాలో ఇప్పటివరకు 490 మంది మరణించారు.