Seoul floods : సియోల్‌లో భారీ వరదలు..ఎనిమిది మంది మృతి

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో సియోల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి.ఈ వరద ధాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు.

Seoul floods : సియోల్‌లో భారీ వరదలు..ఎనిమిది మంది మృతి

Heavy flooding in Seoul..the capital of South Korea

Updated On : August 9, 2022 / 4:36 PM IST

Heavy flooding in Seoul..the capital of South Korea : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో సియోల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. సోమవారం (ఆగస్టు8,2022) రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు భారీగా చేరుకుంది. ఈ వరద ధాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు.మరో 14 మంది గాయపడ్డారు. భారీగా కురుస్తునన్న వర్షం వల్ల సోమవారం రాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రోడ్లపై కార్లు నీటమునిగిపోయాయి. మెట్రో స్టేషన్ మొత్తం జలమయమైపోయింది. మెట్రో మెట్ల మెట్ల నుండి వరదనీరు ప్రవహించడంతో అక్కడ పార్క్ చేసిన కార్లు కిటికీల వరకు మునిగిపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో అయితే గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది అని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని రోజులపాటు వర్షపాతం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంతో అవసరం అయితేనే గానీ ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించారు. కొన్ని వీధుల్లో భారీగా వరద నీరు చేరటంతో హాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి ఉంది.

బంజిహా అనే ప్రాంతంలో వరద నీరు నడుముపై వరకు చేరటంతో ఆ ప్రాంతంలో ఓఅపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ముగ్గురు నీటిలో చిక్కకున్నారని..వారు అపార్ట్ మెంట్ సెల్లార్ పోర్షన్ కావటంతో..వారిని రక్షించటానికి వెళ్లలేకపోయామని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఆ ముగ్గురిలో ఇద్దరు 40 ఏళ్ల అక్కచెల్లెళ్లు కాగా మరో 14 ఏళ్ల పాప ఉన్నారని తెలిపారు. వారి వద్దకు చేరుకుని వారిని రక్షించలేకపోయామని రెస్క్యూ సిబ్బంది వాపోయారు.10 ఏళ్లుగా వారు అక్కడ నివసిస్తున్నారు. తాము అక్కడికి వచ్చే సమయానికి వారి ఇల్లు నీట ముగిపోయిందని..కొంచెం ముందు వచ్చి ఉంటే వారిని రక్షించేవారమని వారిని కాపాడలేకపోయినందు చాలా బాధగా ఉందని రెస్క్యూ టీమ్ తెలిపింది.

ఈ ప్రదేశాన్ని అధ్యక్షుడు యూన్‌ మంగళవారం సందర్శించారు. సియోల్‌ సమీపంలోని ఇంచియాన్.. గ్యాంగీల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సియోల్‌లోని డాంగ్జాక్‌ జిల్లాలో గంటకు 141.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 1942 నుంచి ఇదే అత్యధిక వర్షపాతంగా నమదు అయ్యింది.

సియోల్‌లో భారీగా కురుస్తున్న వర్షానికి రవాణా సౌకర్యాలు మొత్తం నిలిచిపోయాయి. నగరంలో రైల్వే సేవలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌-యేల్‌ అధికారులను ఆదేశించారు.