Tweet Using Mind : వండర్.. ఒళ్లంతా చచ్చుబడిన వ్యక్తి ట్వీట్ చేశాడు.. వరల్డ్ ఫస్ట్ పర్సన్

పక్షవాతంతో శరీరమంతా చచ్చుబడిపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితి. అయినా ఆయన ట్వీట్ చేయగలిగారు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.

Tweet Using Mind : వండర్.. ఒళ్లంతా చచ్చుబడిన వ్యక్తి ట్వీట్ చేశాడు.. వరల్డ్ ఫస్ట్ పర్సన్

Hello World

Updated On : December 28, 2021 / 11:16 PM IST

Tweet Using Ming : పక్షవాతంతో శరీరమంతా చచ్చుబడిపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితి. అయినా ఆయన ట్వీట్ చేయగలిగారు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం. మ్యాటర్ ఏంటంటే.. ఆ వ్యక్తి తన వేళ్లతో కాకుండా మెదడును ఉపయోగించి ట్వీట్ చేశాడు. ఇలా.. మెదడుతో ట్వీట్ చేసిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడు.

New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ ఓకీఫ్(62) వేళ్లతో కాకుండా మొదడును మాత్రమే ఉపయోగించి ట్వీట్‌ చేశాడు. ఆయన మెదడు కంప్యూటర్‌కి కనక్ట్‌ అవ్వడంతో తన ఆలోచనలకు అనుగుణంగా సందేశం కంప్యూటర్‌లో టైప్‌ అవుతుంది. నిజానికి ఫిలిప్‌ 2015 నుండి అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్‌ఎస్‌)తో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితి కారణంగా ఆయన శరీరం అంతా పక్షవాతానికి గురైంది. కదల్లేని పరిస్థితి. అయితే కాలిఫోర్నియాకు చెందిన బ్రెయిన్‌-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ కంపెనీ ఇలాంటి వ్యక్తులు తమ మనసుతో కంప్యూటర్‌ని ఆపరేట్‌ చేయగలిగేలా ఒక సరికొత్త టెక్నాలజీ తెచ్చింది.

ఆ కంపెనీ వాళ్లు ఫిలిప్‌ మొదడుని కంప్యూటర్‌కి అనుసంధానిస్తూ పేపర్‌క్లిప్ పరిమాణంలో ఉండే సింక్రోన్ స్టెంట్రోడ్ అనే మైక్రోచిప్‌ని అమర్చారు. మెదడు ఆలోచనలను ఈ మైక్రోచిప్‌ చదివి టెక్స్ట్ రూపంలో అనువదిస్తుంది. ఫిలిప్‌కి ఈ బ్రెయిన్ ఇంప్లాంట్‌ సాంకేతికతో ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

”అనుకున్నదే తడువుగా ఫిలిప్ ‘హలో వరల్డ్’ అనే సందేశాన్ని ట్వీట్‌ చేశాడు. ప్రపంచంలోనే ఆలోచన ద్వారా నేరుగా సోషల్ మీడియా సందేశాన్ని విజయవంతంగా పోస్ట్ చేసిన తొలి వ్యక్తిగా ఫిలిప్ నిలిచాడు. “ఈ టెక్నాలజీ గురించి తొలిసారి విన్నప్పుడు ఆశ్చర్యపోయా. అంతేకాదు ఈ సాంకేతికతను వినియోగించాలంటే కొంత సాధన కూడా అవసరం. ఇక ఇప్పుడు నేను కంప్యూటర్‌లో ఎక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. అంతేకాదు ఈ-మెయిల్‌, షాపింగ్‌, బ్యాంకింగ్‌ వంటి పనులన్నీ కంప్యూటర్‌లో చేయగలను” అని ఫిలిప్ అన్నారు.