Google Pay users: గూగుల్ పేలో అమెరికా నుంచి డబ్బులు ఇలా పంపేయొచ్చు

ఒక్క రూపాయి నుంచి 25వేల వరకూ మనీ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించిన గూగుల్ పే.. ఇకపై ఇంటర్నేషనల్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.

Google Pay users: గూగుల్ పేలో అమెరికా నుంచి డబ్బులు ఇలా పంపేయొచ్చు

Google Pay

Updated On : May 12, 2021 / 8:30 PM IST

Google Pay users: ఒక్క రూపాయి నుంచి 25వేల వరకూ మనీ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించిన గూగుల్ పే.. ఇకపై ఇంటర్నేషనల్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.

గూగుల్ పే వినియోగదారులకు, ఆన్ లైన్లో అమెరికా నుంచి ఇండియాకు డబ్బును పంపుదామనుకునేవారికి (Google Pay) గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ లో ఉండే యూజ‌ర్ల‌కు డ‌బ్బులు పంపే వెసలుబాటును ఆ సంస్థ క‌ల్పించింది.

ఈ మేర‌కు ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్టరన్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుని యూజ‌ర్ల‌కు స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గూగుల్ పే తెలిపింది. వెస్ట్ర‌న్ యూనియ‌న్‌తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు మనీ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

ఇక వైజ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యాలు కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇవన్నీ పర్సనల్ యూజర్లకు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని, బిజినెస్ లావాదేవీల‌కు ఈ సౌక‌ర్యం ఉండ‌బోద‌ని గూగుల్ వివ‌రించింది.

అమెరికా నుంచి ఇండియాలో ఉన్నవారికి మనీ ట్రాన్సఫర్ ఫెసిలిటీ అయితే కల్పించింది. కానీ, అలా చేసేందుకు ఎంత ఛార్జ్ చేస్తుందో ఇంకా వెల్లడించలేదు. గూగుల్ పే సర్వీసును దేశీయంగా మాత్రమే వాడేవారు. ఆ సర్వీసును అంతర్జాతీయంగా వాడకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది గూగుల్.