కరోనా తోపాటు…బర్డ్ ఫ్లూ వైరస్ : చైనాకు ముంచుకొచ్చిన మరో ప్రమాదం

గోటితోపొయేదాన్ని… ఇంతవరకు తెచ్చుకుంది చైనా. డిసెంబర్ మొదటి వారంలోనే కరొనా లక్షణాలు కనిపించినా…పరువుకోసం బైటపెట్టకుండా వైరస్ ను పెంచిపోషించింది… ప్రపంచం మీద రుద్దింది. కరొనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి చైనా సర్వశక్తులుకూడదీసుకుని పనిచేస్తోంది. ఈ సమయంలో చైనామీద మరో దెబ్బ. హునాన్ రాష్ట్రంలో H5N1 bird flu నమోదైంది. ఈ రాష్ట్రంలోని షాయోయాంగ్ పట్టణంలో బర్డ్ ఫ్లూ దెబ్బకు వేలాది కోళ్లు చనిపోతున్నాయి.
ఈ పట్టణం ఆధారపడిందే పౌల్ట్రీమీద. 7,850 కోళ్లు ఉన్న ఓ ఫామ్ కు బర్డ్ ఫ్లూ సోకింది. 4,500 కోళ్లు H5N1 avian flu వల్ల చనిపోయాయని చైనా వ్యవసాయ, గ్రామీణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయో… చుట్టుప్రక్కలున్న కోళ్ల ఫామ్స్ లోని వేలాది కోళ్లను చంపేస్తున్నారు.
ఒకపక్క కరొనా వైరస్ ప్రబలకుండా చైనా అన్ని చర్యలు తీసుకొంటోంది. మాస్కులు లేకుండా ఎవరూ బైటతిరగకూడదని అలర్ట్ చేసింది. ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ రావడంతోనే చైనా ముందస్తు చర్యలు తీసుకొంటోంది. కరొనా తరహాలో రహస్యవిధానాన్ని పాటించకుండా… ముందుగానే ప్రకటించింది. దీనివల్ల మిగిలిన ప్రాంతాలకు బర్డ్ ఫ్లూ రాకుండా జాగ్రత్తలు తీసుకొనే అవకాశం వచ్చింది.
ఈ H5N1 avian flu virusను bird flu అని పిలుస్తారు. అడవి పక్షుల నుంచి వ్యాప్తిచెందే ఈ వైరస్ కోళ్లకు సంక్రమిస్తుంది…అక్కడ నుంచి మనుషులకు. 1996లో బాతుల్లో కనిపించిన ఈ వైరస్ కోళ్ల పరిశ్రమకు శాపం. బర్డ్ ఫ్లూను అడ్డుకోవడానికి కోట్లాది కోళ్లను చైనా చంపేసింది.
ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం…ఒకరిని నుంచి మరొకరికి బర్డ్ ఫ్లూ సోకడం కష్టమే అయినా…అవకాశాలున్నాయి. 2003 – 2019మధ్య WHO ప్రకారం 861 మందికి H5N1 సోకింది. ఇందులో 455 మంది చనిపోయారు. ఒక్క చైనాలో గత 16 ఏళ్లలో 53 మందికి సోకింది. అందులో 31 మంది చనిపోయారు.