Khalistani terrorist : కెనడాలోకి పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందూ గ్రూప్ డిమాండ్

కెనడా దేశంలోకి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందువులు డిమాండ్ చేశారు. పన్నూన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై కెనడా హిందూ ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది....

Khalistani terrorist : కెనడాలోకి పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందూ గ్రూప్ డిమాండ్

Khalistani terrorist Pannun

Updated On : September 27, 2023 / 7:45 AM IST

Khalistani terrorist : కెనడా దేశంలోకి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందువులు డిమాండ్ చేశారు. పన్నూన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై కెనడా హిందూ ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. పన్నూన్ ప్రత్యేక సిక్కు రాష్ట్రం ఏర్పాటు కోసం పనిచేస్తున్న సిక్కు ఫర్ జస్టిస్ సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్నారని హిదువులు ఆరోపించారు. (Hindu group seeks ban on Khalistani terrorist Pannuns)

Anti-Drone Systems : ఇక సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు…కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వెల్లడి

గతంలో పన్నూన్ ను భారత ప్రభుత్వం సిక్కు ఉగ్రవాదిగా ప్రకటించి అతన్ని నిషేధించిందని కెనడా హిందూ ఫోరం రాసిన లేఖలో పేర్కొంది. ఇండో-కెనడియన్ హిందువులందరినీ కెనడా విడిచిపెట్టమని పన్నూన్ వీడియోలో బెదిరించాడు.

Iraq Fire During Wedding : ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం…100మంది మృతి, 150 మందికి గాయాలు

ఖలిస్థాన్ అనుకూల సిక్కులు ఎల్లప్పుడూ కెనడాకు విధేయులుగా ఉంటారని, కెనడా దేశ చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారని పన్నూన్ పేర్కొన్నారు. వైరల్ అయిన మరో వీడియోలో పన్నూన్ ఇండో-కెనడియన్ హిందువులను దేశం విడిచి భారతదేశానికి తిరిగి వెళ్లాలని బెదిరించాడు.