హాలీవుడ్ సినిమాల్లో సీన్లు తలపించేలా.. ఎర్రసముద్రంలో బాంబులు పెట్టి భారీ షిప్‌ను పేల్చేసిన హౌతీ మిలిటెంట్లు.. వీడియో చూశారా..

స్టెమ్ షిప్పింగ్ ప్రకారం.. హౌతీ మిలిటెంట్ల దాడితో సముద్రగర్భంలో మునిగిన భారీ ఓడ.. చైనా నుంచి టర్కీకి ఇనుము, ఎరువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది.

హాలీవుడ్ సినిమాల్లో సీన్లు తలపించేలా.. ఎర్రసముద్రంలో బాంబులు పెట్టి భారీ షిప్‌ను పేల్చేసిన హౌతీ మిలిటెంట్లు.. వీడియో చూశారా..

cargo ship

Updated On : July 10, 2025 / 1:41 PM IST

Houthi attack on cargo ship in Red Sea: ఎర్రసముద్రంలో హౌతీ మిలిటెంట్లు రెచ్చిపోయారు. లైబీరియన్ జెండా కలిగిన కార్గో షిప్‌ను పేల్చేశారు. హాలీవుడ్ సినిమాల్లోని సీన్లను తలపించేలా బాంబులతో భారీ ఓడను సముద్ర గర్భంలో కలిపేశారు. ఈ షిప్‌లో 25మంది ఉండగా.. వారిలో ఆరుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలిసింది. అయితే, హౌతీకి చెందిన మీడియా తాజాగా.. కార్గో షిప్ ను పేల్చేసిన వీడియోను విడుదల చేసింది.

Also Read: ఆ ఫ్లైట్ కూల్చేసింది రష్యానే.. 298 మంది మృతికి కారణం కూడా అదే.. తేల్చి చెప్పిన యూరప్ కోర్టు

స్టెమ్ షిప్పింగ్ ప్రకారం.. హౌతీ మిలిటెంట్ల దాడితో సముద్రగర్భంలో మునిగిన భారీ ఓడ.. చైనా నుంచి టర్కీకి ఇనుము, ఎరువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది. కాల్పులు, రాకెట్ చోదక గ్రెనేడ్లు, సముద్ర డ్రోన్లు, క్షిపణులతో నాలుగు గంటల పాటు దాడి జరిగింది. ఇది కీలకమైన సముద్ర వాణిజ్య మార్గంలో హౌతీలు నిర్వహించిన అత్యంత తీవ్రమైన దాడిని సూచిస్తుంది. తుర్కియేకు పెద్ద మొత్తంలో సరకులతో వెళుతున్న ఓడను ముంచేస్తూ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు చేశారు.

ఎర్ర సముద్రంలోని యూరోపియన్ యూనియన్ నావికాదళ మిషన్ నుండి ఒక ప్రకటన ప్రకారం.. షిప్‌లోని సిబ్బందిలో 22 మంది నావికాదళానికి చెందిన వారు కాగా.. వారిలో 21 మంది ఫిలిప్పీన్స్, ఒక రష్యన్. అలాగే ముగ్గురు సభ్యుల భద్రతా బృందం ఉన్నారు. రక్షించబడిన వారిలో ఐదుగురు ఫిలిప్పీన్స్, ఒక భారతీయుడు ఉన్నారు.
షిప్‌పై గంటల తరబడి జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారని, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయం తెలియలేదని ఈయూ (యూరోపియన్ యూనియన్) దళం తెలిపింది.
హౌతి మిలిటెంట్లు రాకెట్ ఆధారిత గ్రెనేడ్లు, చిన్న ఆయుధాలతో భారీ ఓడపై దాడి చేశారని, తరువాత రెండు డ్రోన్లు, బాంబులను మోసుకెళ్ళే రెండు డ్రోన్ పడవలను ఉపయోగించి ఓడపై దాడి చేశారని ఈయూ దళం తెలిపింది. బుధవారం ఉదయం 7.50 గంటలకు భారీ షిప్ మునిగిపోయిందని తెలిపింది.