10మంది భారత జవాన్లను చైనా ఆర్మీ 3రోజుల పాటు తన కస్టడీలో ఎలా ఉంచింది, గాల్వన్ ఇన్ సైడ్ స్టోరీ
తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక

తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక
తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకి చెందిన 43మందికిపైగా జవాన్లు మృతి చెందారు. కాగా, ఈ ఘర్షణలో చైనీస్ ఆర్మీ 10మంది భారత జవాన్లను కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ తర్వాత భారత్ నుంచి వచ్చిన ఒత్తిడితో, సుదీర్ఘ చర్చల తర్వాత మన జవాన్లను చైనా ఆర్మీ విడుదల చేసింది. అసలు మన వాళ్లను చైనీస్ ఆర్మీ ఏ విధంగా కస్టడీలోకి తీసుకుంది? మూడు రోజుల పాటు వారిని ఎక్కడ ఉంచింది? ఏం చేసింది? ఎలా వ్యవహరించింది?
చైనా తన కస్టడీలోకి తీసుకున్న 10మంది భారత జవాన్లలో నలుగురు ఆఫీసర్లు కూడా ఉన్నారు. చైనీస్ ఆర్మీ వారిని వెంటనే విడుదల చేయలేదు. ఇండియా-చైనా అధికారుల మధ్య సుదీర్ఘమైన మంతనాల తర్వాత, భారత్ ఒత్తిడి తేవడంతో మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు చైనీస్ ఆర్మీ తమ కస్టడీలో ఉన్న 10మంది భారత జవాన్లను క్షేమంగా విడిచిపెట్టింది.
సుదీర్ఘ చర్చల తర్వాత 10మంది భారత జవాన్లు విడుదల:
తమ కస్టడీలో భారత జవాన్లు ఉన్నారనేది నిజమే అని, వారంతా క్షేమంగా ఉన్నారని చెప్పిన చైనా వారిని విడుదల చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ప్రొసీజర్ పేరుతో చైనా మన వాళ్లను తన ఆధీనంలో ఉంచుకుంది. అయితే ఇదంతా చైనా మైండ్ గేమ్ అని ఆర్మీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జూన్ 16,17,18 తేదీల్లో ఇరు దేశాలకు చెందిన మేజర్ జనరల్స్ మధ్య చర్చలు జరిగాయి. చివరికి జూన్ 18న అంటే ఘర్షణ జరిగిన మూడు రోజుల తర్వాత భారత జవాన్లను చైనీస్ ఆర్మీ విడిచిపెట్టింది. అయితే భారత జవాన్లు చైనీస్ ఆర్మీ కస్టడీలో ఉన్నారనే విషయాన్ని భారత ఆర్మీ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు.
ఘర్షణకు కారణం ఇదే:
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్ దగ్గర జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 అనే చోట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. జూన్ నెల ప్రారంభంలోనే ఈ టెంట్ వేశారు.
పథకం ప్రకారమే చైనా దాడి:
గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్ 6న భారత్, చైనా లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే పథకం ప్రకారం చైనా జవాన్లు దాడి చేశారు. పెట్రోలింగ్ పాయింట్ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. పదునైన మేకులు చుట్టిన ఇనుప రాడ్లతో దాడికి దిగారు.
సింహాల్లా పోరాడిన భారత జవాన్లు:
ఆరు గంటలపాటూ జరిగిన తోపులాటలోపక్కనే ఉన్న గాల్వన్ లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ పాయింట్ 14 గాల్వన్, ష్యోక్ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. వాళ్లు 300మంది, మనోళ్లు 100.. ఒళ్లంతా గాయాలు, చుట్టూ శత్రుబలగాలు.. అయినా మన జవాన్లు సింహాల్లా గర్జించారు. చైనా జవాన్లపై తిరగబడ్డారు. భారత జవాన్ల నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురుకావడంతో చైనా జవాన్లు బిత్తరపోయారు.
Read: ప్లీజ్..మోదీజీ..పాకిస్థాన్ అమ్మాయితో నా పెళ్లి చేయండి..భారత యువకుడి కోరిక