Ships Steering Control: సూయజ్‌లాంటి జల మార్గాల్లో అతిపెద్ద ఓడల స్టీరింగ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది? ఎమర్జెన్సీ బ్రేకులు పడవా?

మహా సముద్రాల్లో నడిచే భారీ నౌకలు ఎలా కంట్రోల్ అవుతాయో తెలుసా? వందలాది అతిపెద్ద భారీ కంటైనర్లతో వెళ్లే క్రూయిజ్ వంటి నౌకల్లో ఎలా బ్రేకులు పడతాయి.. స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేస్తారు..

Ships Steering Control: సూయజ్‌లాంటి జల మార్గాల్లో అతిపెద్ద ఓడల స్టీరింగ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది? ఎమర్జెన్సీ బ్రేకులు పడవా?

How Control Steering Work In World's Biggest Ships While On Waterways (1)

Updated On : March 30, 2021 / 5:16 PM IST

world’s biggest Ships Steering Control : చాలావరకూ మోటార్ వెహికల్స్‌లో ఎమర్జెన్సీ స్టాప్ కోసం బ్రేకులు ఉంటాయి. హెవీ వాహనాల్లో ఇది కామన్.. వాహనం కదిలే సమయంలో స్టీరింగ్ తిప్పుతూ డ్రైవర్ బ్రేక్ కొడతాడు. అదే కారు అయితే వెంటనే ఫుల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ, హెవీ వెహికల్స్ అయితే ఎలా కంట్రోల్ అవుతాయి.. అందులోనూ మహా సముద్రాల్లో నడిచే భారీ నౌకలు ఎలా కంట్రోల్ అవుతాయో తెలుసా? వందలాది అతిపెద్ద భారీ కంటైనర్లతో వెళ్లే క్రూయిజ్ వంటి నౌకల్లో ఎలా బ్రేకులు పడతాయి.. స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేస్తారు..

Ships

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకుంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద రద్దీ జలమార్గమైన సూయిజ్ కెనాల్‌లో ఎవర్ గివెన్ భారీ నౌక చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇంతటి భారీ నౌక కెనాల్‌కు అడ్డంగా ఇరుక్కుపోయింది. అతిపెద్ద రాకసి ఇసుక తుపాను గాలుల బీభత్సానికి ఈ భారీ నౌక కంట్రోల్ తప్పింది. దాంతో ఇసుకలో నౌక కూరుకుపోయింది. దాంతో అటుగా వెళ్లే నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతి రోజు ఇదే జలమార్గంలో సగటున 106కు పైగా భారీ కంటైనర్ నౌకలు వెళ్తుంటాయి. ప్రపంచపు అతిపెద్ద నౌకలన్నీ ఈ మార్గంలోనే వందలాది కంటైనర్లను రవాణా చేస్తుంటాయి.

Everg

కెప్టెన్ యష్ గుప్తా మాటల్లోనే.. :
అయితే ఈ భారీ నౌకల పనితీరుకు సంబంధించి కెప్టెన్ యష్ గుప్తా తన 20ఏళ్ల అనుభవాన్ని వివరించారు. సముద్రయాన జీవితం ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అలాగే ఎప్పుడు ఏ విపత్తు ముంచుకువస్తోందో కూడా ఊహించలేమంటున్నారు. ఎదురుగా భారీ తుపాను ముంచుకుస్తున్నా కూడా ఐదు మీటర్లు లేదా ఆరు మీటర్లు, లేదంటే ఎనిమిది మీటర్ల దూరంలో ఉన్నా తెలియదని అంటున్నారు. అందుకే ఎప్పుడూ నేవిగేషన్ టీమ్ అప్రమత్తంగా ఉంటుందంట.. వచ్చే పోయే రూట్ మ్యాప్, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తుంటారట. నీళ్లలో ఉండే నౌక.. భారీ తుపాన్ గాలి తీవ్రతను కంట్రోల్ చేయడం సాధ్యపడదంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా బ్రేక్ కొట్టడం వీలుపడదంటున్నారు. రోడ్డుపై కారుకు బ్రేక్ కొట్టినంత సులభంగా బ్రేక్ పడదని చెబుతున్నారు.

Evergreen

నౌకను వేగంగా కంట్రోల్ చేయలేమా? :
మరి ఎలా భారీ కంటైనర్ నౌకను వేగంగా కంట్రోల్ చేయలేమా? అంటే.. గుప్తా సమాధానం ఇదే… కార్గో నౌకల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందట. అంటే.. ఈ కంటైనర్ నౌకలు ఆలస్యాన్ని తగ్గించడమే కాకుండా కంటైనర్ నౌకలు వేగంగా నడిచేందుకు సాధ్యమైనంత తక్కువ సమయంలో వేగాన్ని తగ్గించేలా నిర్మించారు. అందుకే అంత పెద్దవిగా కనిపిస్తాయంట.. వేగంగా వెళ్లే ఒక భారీ కంటైనర్ల నౌక టాప్ స్పీడ్ నుంచి కంట్రోల్ చేయాలంటే 1.8 మైళ్లు తీసుకుంటుంది. నౌక ఆగడానికి కనీసం 14 నిమిషాల నుంచి 16 నిమిషాలు పడుతుందని గుప్తా పేర్కొన్నారు. ఈ నౌకల్లో స్టీరింగ్ మెకానిజమ్ ఒక్కో నౌకలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని డయల్స్, బటన్లు, లెవర్ల ద్వారా స్టీరింగ్ కంట్రోల్ చేస్తారు. స్టీరింగ్ వీల్స్ ఎలక్ట్రానిక్స్‌తో పనిచేస్తాయని గుప్తా తెలిపారు.

Gree

స్టీరింగ్ తిరిగినప్పుడు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇస్తుంది. అది ఇచ్చిన ఆదేశం ప్రకారమే నౌక గమనం మారుతుంది. సూయెజ్ కెనాల్ ద్వారా నావిగేట్ అయితే.. అప్పుడు నౌకలు కాన్వాయ్‌లో ప్రయాణిస్తాయి. ఈ కెనాల్ దాటడానికి సుమారు 12 గంటల నుండి 16 గంటలు పడుతుంది. సాధారణంగా ఓడ వేగంలో కంటే తక్కువ వేగంతో ప్రయాణించాలి. వేగంలో ఏమాత్రం అటు ఇటూ అయినా వెంటనే ఢీకొనే ప్రమాదం ఉందని గుప్తా తెలిపారు. రోడ్డుపై మాదిరిగా ఒక ఓడను మరో ఓడ ఓవర్ టేక్ చేసే పరిస్థితి ఉండదట.. కొన్ని ప్రాంతాల్లో కెనాల్ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని చెప్పారు.

Evergree

ఇలాంటి పరిస్థితుల్లో ఓడ నడిపే పైలట్లు ఇతర పైలట్లతో ఎప్పటికప్పుడూ రేడియో తరంగాల ద్వారా కమ్యూనికేట్ అవుతుంటారు. అలా ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్తుంటారు. అన్ని నౌకల యాక్టివటీలన్నింటిని మానిటర్ చేసేందుకు పెద్ద రాడర్, అతిపెద్ద నావిగేషన్ ఉంటుంది. దీనిద్వారా ఓడల కదిలికలను పర్యవేక్షిస్తుంటారు. ఇరుకుగా ఉండే కెనాల్ దగ్గర భారీ కంటైనర్ నౌకలకు సవాళ్లగా మారుతున్నాయని చెప్పారు.