చైనా ను దాటిపోయేందుకు భారత్ కు ఇదే అవకాశం…ముఖ్యమైన ఐదు అంశాలు
కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ చైనాపై మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు "కరోనా వైరస్"ను చైనా సృష్టించిన బయో వెపన్ గానే చూస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ చైనాపై మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు “కరోనా వైరస్”ను చైనా సృష్టించిన బయో వెపన్ గానే చూస్తున్నాయి. కరోనా కిట్ ల విషయంలో కూడా చైనా తీరుపై ప్రపంచదేశాలన్నీ మండిపడుతున్నాయి. ఇటువంటి విపత్కర సమయాల్లో కూడా చైనా చీప్ కిట్ లను పంపిందంటూ ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా దేశంలో పెట్టుబడులు ఉపసంహరిచుకునేందుకు, ఇప్పటికే చైనాలో ఉన్న తమ కార్యాలయాలను మరో చోటుకి తరలించేందుకు వివిధ దేశాలు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సమయంలో ప్రస్తుతం భారత్ అటెన్షన్…కరోనా వైరస్ కర్వ్ ను క్రిందికి వంచడం నుండి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి జాగ్రత్తగా మారుతుంది. ప్రస్తుతం మోడీ సర్కార్ ప్రధాన ఎకనామిక్ ఫోకస్…. షార్ట్ టర్మ్,స్టాప్-గ్యాప్, స్థిరత్వమైన కొలతలపై ఉంది. అయితే ఊహించని విధంగా కరోనా సంక్షోభం భారత్ కు….మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ను విస్తరించేందుకు మరియు పునురుద్ధరించబడిన ప్రపంచ సరఫరా గొలుసులో(revamped global supply chains)అతిపెద్ద పాత్ర పోషించే longer-horizon(సుదీర్ఘ సమయం)అవకాశాన్ని దక్కించింది. అయితే చైనాపై ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఆధారపడటం ద్వారా ఏర్పడిన శూన్యతను పూరించడానికి భారతదేశం పోటీ చేయడానికి సిద్ధంగా ఉందా?
ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన బ్లాగ్ లో పోస్ట్ చేసిన దాని ప్రకారం…భారత్ ఆ సందర్భానికి చేరకునే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కరోనా తర్వాత ప్రపంచంలో…వివిధ సరఫరాల చైన్స్ యొక్క గ్లోబల్ నర్వ్ సెంటర్ గా భారత్ మారుతుందన్నారు. అయితే ఈ జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం భారతదేశం ఇప్పుడు ధైర్యమైన, సృజనాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించి, అనుసరించాల్సిన అవసరముందని మోడీ తెలిపారు.
అసలు కరోనా మహమ్మారి వేగవంతం చేసిన తయారీ మరియు సరఫరా గొలుసు అవకాశాలను స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం తీసుకోవలసిన ఐదు దశలు ఇప్పుడు చూద్దాం.
మొదటిది : ఆదివారం నాటి మేసేజ్ ను బలోపేతం చేసేందుకు ప్రధాని తన స్థాయిని వాడుకోవాలి. భారత దేశం చాలా ఆశక్తిగా ఉందని మరియు ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడుల ప్రవాహాలు మారడంతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని అంతర్జాతీయంగా మరియు దేశీయ ప్రేక్షకులకు స్పష్టంగా సిగ్నల్ వెళుతుంది. మేక్ ఇన్ గ్లోబల్ ఇండియా (MGI)ఆవిష్కరణను ప్రకటించడంతో.. చైనాపై ఎక్కువ ఆధారపడటం అవసరం లేదని దేశాలకు అతను చెప్పనవసరం లేదు. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ తయారీ మరియు సరఫరా గొలుసు నిర్మాణంలో(emerging international manufacturing and supply chain architecture)పెట్టుబడుల కోసం దూకుడుగా పోటీ పడటానికి దాని పాలసీలను సర్దుబాటు చేయాలనే భారతదేశ ఉద్దేశాన్ని ఆయన నొక్కి చెప్పాలి.
రెండవది : తమ సరఫరా సంస్థలను పున రూపకల్పన(reshaping) చేస్తున్న గ్లోబల్ కంపెనీలను చేరుకోవడానికి…తన వ్యక్తిగత ప్రతినిధిగా మేక్ ఇన్ గ్లోబల్ ఇండియా ప్రత్యేక రాయబారిని మోడీ నియమించాలి. ఈ ప్రత్యేక రాయబారి… ప్రపంచ మార్కెట్ల గురించి లోతైన జ్ఞానం మరియు న్యూ ఢిల్లీ ఎలా పనిచేస్తుందో తెలిసిన భారతదేశపు ప్రైవేట్ రంగానికి చెందిన పేరున్న నాయకుడిగా ఉండాలి.
మూడవది : మేక్ ఇన్ గ్లోబల్ ఇండియా (MGI)ఆవిష్కరణ… ముఖ్యంగా జపాన్,యూఎస్ కంపెలను టార్గెట్ చేయాలి. జపాన్ కంపెనీలు చైనా నుంచి తమ ప్రొడక్షన్ ను మరో దేశంకి మార్చుకునేందుకు జపాన్ ప్రభుత్వం ఇటీవల ఓ భారీ ప్రోగ్రామ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా కార్పొరేట్‌ల విషయానికొస్తే.. ఫిబ్రవరి మధ్యలో, యుబిఎస్ ఎవిడెన్స్ ల్యాబ్ ద్వారా చేయబడిన అమెరికన్ సిఎఫ్‌ఓల కరోనా మహమ్మారి ముందు సర్వేలో… 76% మంది ప్రతివాదులు(respondents) చైనాకు దూరంగా తయారీని వైవిధ్యపరచడం ప్రారంభించారని లేదా రక్షణాత్మక విధానాల వల్ల ప్రణాళికలు వేస్తున్నారని కనుగొన్నారు. అదే సర్వేలో…తయారీ కంపెనీల మార్పు కోసం ఆసియాలో టాప్ పొటెన్సియల్ డెస్టినేషన్ గా భారతదేశం ఉందని తేలింది. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్.. మైక్ పాంపీ గత వారం జర్నలిస్టులతో మాట్లాడుతూ… భారతదేశం మరియు అమెరికా “సప్లయ్ చైన్స్ ను పట్టుకోవాలనుకుంటున్నాయి… ఇవి జాతీయ భద్రతకు ముఖ్యమైనవి అని ఆయన అన్నారు.
నాల్గవది : తన తీవ్రతకు స్పష్టమైన సంకేతాలను అందించడానికి… ప్రభుత్వం వెంటనే విధాన కార్యక్రమాలను రూపొందించి, విదేశీ పెట్టుబడులపై ఇనుము వంటి దృఢమైన ప్రతిజ్ఞలను చేయాలి. వీటిలో ఇవి ఉండాలి: (a) భారతదేశపు అంతర్జాతీయ ఖ్యాతిని చాలా కాలంగా దెబ్బతీసిన “పన్ను ఉగ్రవాదానికి” ముగింపు;(b)అధికంగా పెరిగిన FDIని ఆకర్షించడానికి కీలకమైన కార్మిక మార్కెట్ మరియు భూసేకరణ సంస్కరణల పార్లమెంటులో పరిచయం; (c) అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండటానికి ప్రతీకగా శక్తివంతమైన నిబద్ధత వంటివి ఉండాలి.
ఐదవది : విదేశీ పెట్టుబడిదారులతో పాటు ద్వైపాక్షిక / బహుపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి ఒప్పందాలను బహిరంగంగా తక్కువ చేయడం ప్రభుత్వం ఆపాలి. ఈ ఏడాది జనవరిలో భారత్ లో 1బిలియన్ డార్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ..ఈ సంస్థ దోపిడీ ధర మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో పాల్గొంటుందని సూచించింది. పెట్టుబడి పెట్టేటప్పుడు వారు భారతదేశానికి గొప్ప సహాయం చేస్తున్నట్లు కాదు అని వాణిజ్యశాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ నొక్కి చెప్పారు.