2006 నుంచి Kim Kardashian ఎలా మారిందంటే..?

  • Published By: sreehari ,Published On : October 11, 2020 / 06:20 PM IST
2006 నుంచి Kim Kardashian ఎలా మారిందంటే..?

Updated On : October 11, 2020 / 7:00 PM IST

Kim Kardashian: రియాల్టీ టీవీ స్టార్, బిజినెస్ ఉమెన్, అమెరికన్ స్టార్‌గా పేరొందిన కిమ్ కర్దాషియన్ తాను సర్జరీలు చేయించుకున్నట్టు వస్తున్న రుమర్లను కొట్టిపారేసింది. ఫేవరెట్ సెలబ్రిటీ డెర్మటాలిజిస్ట్‌ను సంప్రదించిన అనంతరం ఆమె ముఖం, శరీరాకృతిలో చాలా మార్పులు కనిపించాయి. దాంతో ఆమె సర్జరీ చేయించుకుందంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి.
Kim Kardashian

2006లో కనిపించిన మొదటిసారి తన శరీరాకృతిపై రుమర్లతో వార్తల్లో నిలిచింది. అప్పటినుంచి ఆమె ముఖంతో పాటు శరీరా ఆకృతిలోనూ అనేక మార్పులు కనిపించాయి. సోరియాసిస్‌కు చికిత్స కోసం కార్టిసోన్ ఇంజెక్షన్లు వాడటం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం అంటున్నారు. ఏది ఏమైనా ఒక్కో ఏడాదిలో కిమ్ శరీర ఆకృతి భిన్నంగా కనిపిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ఏడాది ఏడాదికి కిమ్ లో ఎన్ని మార్పులు వచ్చాయో ఈ ఫొటోలోను చూస్తే అర్థమవుతోంది.

June 2006 :
ఈ ఫొటోలో కిమ్స్ 2006లో ఎలా ఉందో అలానే ఆమె లుక్ కనిపిస్తోంది. ఆమె వక్షోజాలు కూడా నేచురల్ గా ఉన్నాయి. ఆమె కళ్లు, పెదాలు కూడా నేచురల్ లుక్ లో కనిపిస్తున్నాయి. శరీర ఛాయ కూడా క్లియర్ గా కనిపిస్తుంది.Kim Kardashian

January 2009 :
ఈ ఫొటోలో కిమ్స్ శరీర ఛాయలో మార్పు కొట్టచ్చినట్టుగా కనిపిస్తోంది. బహుషా స్కీన్ లేజర్ ట్రీట్ మెంట్ చేయించినట్టుంది. నుదటిపై చర్మం కూడా చాలా సున్నితంగా మారింది. చర్మంపై ముడతలు పోవడానికి కొన్ని ఇంజెక్షన్లు కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

Kim Kardashian

April 2012 :
కిమ్ శరీరం ఆకర్షణీయ రూపంలోకి మారింది. ఆమె నడుము, తొడ భాగమంతా సన్నగా మారాయి. ఫ్యాట్ ట్రీట్ మెంట్ చికిత్సతో ఆమె ఈ రూపానికి మారారు. నడుము, కడుపు తొడల నుంచి కొవ్వును తొలగించి సన్నగా మారిపోయింది. శారీరక శిక్షణతో ఇలాంటి ఫలితాలను పొందడం చాలా కష్టమే.. ఈ విధానం ప్రాణానికి హాని కలిగించే అవకాశం లేకపోలేదు.

Kim Kardashian

June 2016 :
ఈ ఫొటోలో కిమ్ వక్షోజాల ఆకృతిలో మార్పు కనిపిస్తోంది. బ్రెస్ట్ పరిమాణం వృద్ధిచెందినట్టుగా కనిపిస్తోంది. కిమ్స్ ముఖం చాలా విభన్నంగా కనిపిస్తోంది. ఆమె గడ్డం మీద భాగం కూడా బాగా తగ్గిపోయినట్టుగా ఉంది. ముక్కు పరిమాణాన్ని తగ్గించడానికి దవడ దగ్గర శస్త్రచికిత్స చేయించుకున్నట్టుగా ఉంది. బుగ్గల ఆకారం కూడా మారిపోయింది.

Kim Kardashian

June 2018 :
ఈ ఫొటోలో కిమ్స్ శరీరం కిందిభాగమమంతా పూర్తిగా మారిపోయింది. వ్యాయమంతో పాటు డైట్ సరిగా మెయింటైన్ చేస్తూ కిమ్స్.. తన శరీరాకృతిని ఇలా మార్చేసింది. శరీరంలోని కొవ్వును ఒక భాగం నుంచి మరో భాగంలోకి మార్చేసినట్టుగా ఉంది. దాంతో ఆమె శరీరాకృతి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Kim Kardashian

May 2019 :
ఆమె శరీర ఆకృతిలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆమె నడుము చిన్నదిగా కనిపిస్తుంది. ఆమె హిప్స్ కిందిభాగమంతా గుండ్రంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మొదటి ఫొటోల కనిపించిన ఆమె రూపం.. అసహజ శరీర ఆకృతికి మారిపోయింది.

Kim Kardashian