Turkey Earthquake: టర్కీలో భూకంపం.. ఆస్పత్రిలో శిశువుల్ని కాపాడేందుకు నర్సులు ఏం చేశారంటే?
గాజియన్టెప్ పట్టణంలోని ఆస్పత్రిలో కూడా కొందరు శిశువులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో శిశువులు చికిత్స తీసుకుంటున్నప్పుడు భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఐసీయూలోని ఇంక్యుబేటర్లలో చాలా మంది శిశువులు, పక్కనే నర్సులు కూడా ఉన్నారు.

Turkey Earthquake: టర్కీ, సిరియాల్లో గత వారం సంభవించిన భూకంపం వేలాది మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ భూకంపం సందర్భంగా అనేక ఇండ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. కొన్ని మాత్రం మిగిలే ఉన్నాయి. భూకంపం ప్రభావంతో ఒక ఆస్పత్రి భవనం ఊగిపోయింది.
ఈ సమయంలో గాజియన్టెప్ పట్టణంలోని ఆస్పత్రిలో కూడా కొందరు శిశువులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో శిశువులు చికిత్స తీసుకుంటున్నప్పుడు భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఐసీయూలోని ఇంక్యుబేటర్లలో చాలా మంది శిశువులు, పక్కనే నర్సులు కూడా ఉన్నారు. భూకంపం ప్రభావంతో హాస్పిటల్ బిల్డింగ్, అందులోని బేబీ ఇంక్యుబేటర్స్ కూడా ఊగిపోయాయి. మామూలుగా అయితే, నర్సులు భయంతో పిల్లల్ని వదిలేసి, తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడ్నుంచి పారిపోవాలి.
Minister KTR : తెలంగాణపై పగబట్టినట్లే వ్యవహరిస్తోన్న కేంద్రం : మంత్రి కేటీఆర్
కానీ, అక్కడ ఉన్న ఇద్దరు నర్సులు మాత్రం అలా చేయలేదు. బిల్డింగ్ ఊగిపోతూ, ఇంక్యుబేటర్స్ పడిపోయే ఛాన్స్ ఉండటంతో నర్సులు వాటిని గట్టిగా పట్టుకుని ఉన్నారు. చిన్నారుల ప్రాణాల్ని కాపాడాలనుకున్నారు. తమ ప్రాణాలకు తెగించి మరీ చిన్నారుల్ని రక్షించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఒకవైపు ప్రాణాలు పోగొట్టే భూకంపం సంభవించినా భయపడకుండా, తమ విధి నిర్వహణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన నర్సుల్ని అందరూ అభినందిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను టర్కీ పోలీసులు విడుదల చేశారు. ఆ నర్సుల్ని డెవ్లెట్ నైజామ్, గాగ్వి క్యాలిస్కాన్గా గుర్తించారు. పోలీసులతోపాటు అక్కడి అధికారులు, నెటిజన్లు ఆ నర్సుల్ని ప్రశంసిస్తున్నారు.
Sağlıkçılarımız şahane insanlar?#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7’lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı?
?????? pic.twitter.com/iAtItDlOwb
— Fatma Şahin (@FatmaSahin) February 11, 2023