Minister KTR : తెలంగాణపై పగబట్టినట్లే వ్యవహరిస్తోన్న కేంద్రం : మంత్రి కేటీఆర్

కేంద్రం రాష్ట్రంపై పగబట్టినట్లే వ్యవహరిస్తోందన్నారు. బెంగళూరు మెట్రోకు కేంద్రం నిధులిస్తోందన్నారు. అలాగే చెన్నయ్, లక్నో, వారణాసి, గోరక్ పూర్, గుజరాత్ కు కూడా కేంద్రం నిధులిస్తోందని పేర్కొన్నారు. మెట్రో మొదటి దశ-69కి.మీ, రెండవ దశ-62 కి.మీ విమానాశ్రయ లైన్ శంకుస్థాపన చేశామని తెలిపారు.

Minister KTR : తెలంగాణపై పగబట్టినట్లే వ్యవహరిస్తోన్న కేంద్రం : మంత్రి కేటీఆర్

minister ktr

Minister KTR : కేంద్రం రాష్ట్రంపై పగబట్టినట్లే వ్యవహరిస్తోందన్నారు. బెంగళూరు మెట్రోకు కేంద్రం నిధులిస్తోందన్నారు. అలాగే చెన్నయ్, లక్నో, వారణాసి, గోరక్ పూర్, గుజరాత్ కు కూడా కేంద్రం నిధులిస్తోందని పేర్కొన్నారు. మెట్రో మొదటి దశ-69కి.మీ, రెండవ దశ-62 కి.మీ విమానాశ్రయ లైన్ శంకుస్థాపన చేశామని తెలిపారు. రెండవ దశ వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రెండు దశలుగా నిర్మిస్తామని.. మూడేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు.

కేంద్రం మెట్రోరైలుకు నిధులు ఇవ్వకుండ పక్కన పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్నారు. పాతబస్తీ మెట్రోకి రూ.500కోట్లు బడ్జెట్ లో కేటాయించామని పేర్కొన్నారు. మెట్రో ధరలు నిర్ణయించే అధికారం ప్రైవేట్ వారికి కట్టబెట్టారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా పెంచొద్దని.. ఒకవేళ పెంచినా ఆర్టీసీ ధరలకు దగ్గర ఉండేట్లు చూసుకోవాలని కోరామని చెప్పరు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేసీఆర్ సీఎం అవుతారని.. మెట్రో పూర్తి చేస్తారని పేర్కొన్నారు.

Minister KTR : 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాం.. టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదు : మంత్రి కేటీఆర్

టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మెచ్చుకున్నారని పేర్కొన్నారు. అక్కడక్కడా అనుమతులు లేకుండా లే అవుట్లు వెలుస్తున్న వాటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. చట్టాలు తాము రూపొందిస్తామని.. దాన్ని అమలు పర్చాల్సింది అధికారులని తెలిపారు.

హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను ఇతర శాఖలో విలీనం చేశామని తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయని చెప్పారు. ఇండ్లు ఇచ్చిన తర్వాత సొసైటీ ఏర్పాటు చూసుకుని దాని మెయింటనెన్స్ చూసుకోవాలని సూచించారు. ధరణి వచ్చిన తర్వాత చిన్న భూమి కూడా మ్యాప్ చేశామన్నారు. భూములకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.