Mexico earthquake
Mexico earthquake: మెక్సికోలోని పసిఫిక్ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజిక్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
Tras el fuerte sismo el agua de algunas albercas caían de los edificios de av Vallarta #temblorgdl @Trafico_ZMG @Metropoli1150 #sismo pic.twitter.com/Jjah22XLs6
— EMERGENCIAS GUADALAJARA..!!! (@gusdegdl) September 19, 2022
మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు ఏమీ జారీకాలేదు. అయితే భారీఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
MEXICO.
An earthquake of magnitude 7.4 occurred in the west of the state of Michoacán. The source lay at a depth of 25 km. The epicenter was located 103 km from the city of Colima. pic.twitter.com/NB4r4E3nu0— Asif Tintoiya (@TintoiyaAsif) September 19, 2022
ఈ భూకంపం అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో కొలిమా, మిచోకాన్ రాష్ట్రాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భవనాలు ఒక్కసారిగా అటూఇటూ ఊగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మెక్సికన్ పబ్లిక్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ నివేదికలు ఏమీ లేవని తెలిపారు. అయితే కొన్ని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. ఇదిలాఉంటే భారీ తీవ్రతతో భూకంపం రావడంతో భవనాలు, రోడ్లు, కార్లు బొమ్మల్లా ఊగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://twitter.com/itspapajon/status/1571932400648880128?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1571932400648880128%7Ctwgr%5E4d8737050b9fb7a43ef13a64596e92831cbae743%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fworld%2Freport-mexico-earthquake-tsunami-in-swimming-pools-shaking-buildings-roads-and-cars-caught-on-camera-2986526
మెక్సికో పసిఫిక్ తీరంలో భూకంపం సంభవించింది. ప్యూర్టో వల్లర్టాలోని మా హోటల్ గది తీవ్రంగా కదిలింది అని ఓ వినియోగదారుడు ట్విట్టర్ రాశారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. అదేవిధంగా.. భూకంపం దాటికి మా రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్‌లో మినీ సునామీ వచ్చిందంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు.
Alberca en el último piso en Reforma 27 #Temblor en la #CDMX 🇲🇽🕷@andresguzbj pic.twitter.com/TWUcVBBcFo
— Crónicas de la Ciudad Perdida Oscar Blanco CDMX (@OscarBlancoCdmx) September 19, 2022