మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్

పాకిస్థాన్ : పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ విషయంలో పాక్ లోని బాలకోట్ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. ఉగ్రవాద కనుసన్నల్లోనే పాలన సాగించే పాకిస్థాన్..మారణహోమాలు సృష్టించేందుకు మానవబాంబులు దేశంలోనే రూపుదిద్దుకుంటుంటాయి. బాలకోట్ మానవ బాంబుల తయారీ కేంద్రంగా మారిపోయింది.
భారత్ దేశ సరిహద్దులు దాటి పాక్‌లోకి చొరబడి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్‌పై భారత యుద్ధ విమానాలు ఎలా వెళ్లగలిగాయనేది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కీలక ట్రైనింగ్ క్యాంప్ బాలాకోట్‌లో ఉందన్న పక్కా సమాచారంతోనే భారత్ ఎయిర్ సర్జికల్ దాడికి వ్యూహం పన్నింది. ఈ క్యాంప్ లోనే ఆత్మాహుతి దాడికి పాల్పడే మానవ బాంబులకు ట్రైనింగ్ ఇస్తారు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి
నాలుగు దశలుగా మానవబాంబుల తయారీ ట్రైనింగ్
మానవ బాంబులుగా మారేందుకు కొంతమందిని ఉగ్రవాదులు సెలక్ట్ చేస్తారు. తరువాత 15 రోజుల పాటు (మతవిద్వేషాలను రేపేలా) మతపరమైన విద్యలో ట్రైనింగ్ ఇస్తారు. తరువాత రెండో దశ అసలు ట్రైనింగ్ మొదలు పెడతారు. ఈ ట్రైనింగ్ వారం నుంచి పదిహేను రోజులు వరకు కొనసాగుతుంది. ఆ సమయంలోనే వారిని ఫిదాయిగా (మానవ బాంబుగా) మారడానికి ప్రేరేపిస్తారు.
దీని కోసం ‘తలీమ్ ఉల్ ఇస్లాం’, ‘తలీమ్ ఉల్ జీహాద్’, ‘తారీఖ్ ఇ ఇస్లామ్’ అనే మూడు పుస్తకాలలోని సారాంశాలను వారికి టీచింగ్ తో నేర్పిస్తారు. ఇది పూర్తయిన తరువాత మూడో దశలో మానవబాంబుగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన ట్రైనింగ్ (మానసికంగా)ఇస్తారు. వెపన్స్ వినియోగం, అడవుల్లో దాక్కోవడం, ఆకస్మిక దాడి, సమాచార మార్పిడి, జీపీఎస్, మ్యాప్ రీడింగ్ వంటి అవసరమైన అన్ని విషయాలపై ట్రైనింగ్ ఇచ్చేస్తారు.
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు
పలు విద్యలో ట్రైనింగ్
వీటితోపాటు ఈత, గుర్రపు స్వారీ, కత్తి..కర్రసాము వంటి విద్యలలో ట్రైనింగ్ కూడా ఉంటుంది. 40 రోజుల పాటు సాగే ఈ శిక్షణలో ఏకే 47, ఎల్ఎంజీ, రాకెట్ లాంచర్, యూబీజీఎల్, గ్రనేడ్లు సహా అత్యాధునిక ఆయుధాల వాడకం గురించి వివరిస్తారు. ఇక నాలుగో దశలో వీరిని చిన్న చిన్న గ్రూపులుగా విడిదీసి ఒక్కొక్క గ్రూప్ కు కమ్యూనికేషన్ సెట్ ఇచ్చి..వేర్వేరు ఏరియాలకు పంపిస్తారు. అక్కడ నుంచి వీరి మధ్య ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తారు.
అతి కష్టమైన ట్రైనింగ్
- తెల్లవారుజామున 3 గంటలకు మొదలు
- 5 గంటలకు నమాజ్
- 6 నుంచి 7.30 గంటల వరకు ఫిజికల్ ట్రెయినింగ్
- బ్రేక్ ఫాస్ట్ 8.30కి
- ఆయుధాలు, పేలుడు పదార్థాల ఉపయోగం ట్రైనింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
- మధ్యాహ్న భోజన విరామం 1.30
- రెండో నమాజ్ 2 గంటలకు
- 2 నుంచి సాయంత్రం 4 గంటల రెస్ట్
- తరువాత కాన్ సన్ ట్రేషన్ గేమ్స్ చెస్ వంటివి
- సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు అనేక ప్రార్థనలు
- రాత్రి 8.30 నుంచి 9.30 మధ్యలో భోజనం
ఇలా నాలుగు నెలల్లో మూడు దశలు శిక్షణ పూర్తయిన తర్వాత, జీపీఎస్ వినియోగం, మ్యాప్ రీడింగ్, ఐఈడీ తయారీ, ఇంటర్నెట్ తదితర అత్యాధునిక సాంకేతిక శిక్షణకు కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే తీసుకుంటారు. చివరిగా ఫైరింగ్ టెస్ట్‌తో వీరికి శిక్షణ పూర్తవుతుంది.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్