Serbia: ఒకేసారి 115 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో మొదటగా కాల్పులు జరిగాయి. 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీని తీసుకొని కాల్పులు జరిపాడు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం, బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా ఉన్న రెండు గ్రామాలలో 20 ఏళ్ల యువకుడు ఆటోమేటిక్ వెపన్‌తో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు

Bomb Threat: సెర్బియా దేశంలో ఒకే రోజు 115 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో రెండు సామూహిక కాల్పుల అనంతరం భద్రతా ఆందోళనలను నెలకొన్నాయని, ఈ పరిస్థితుల్లో ఇలా బెదిరింపులు వచ్చినట్లు సెర్బియా విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. బెల్‌గ్రేడ్‌లోని 78 ప్రాథమిక పాఠశాలలు, 37 ఉన్నత పాఠశాలలకు పేలుడు పరికరాలు అమర్చినట్లు ఆరోపిస్తూ బుధవారం తెల్లవారుజామున ఇమెయిల్ ద్వారా హెచ్చరికలు అందాయని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Madhya Pradesh : మూడో భార్య చెప్పిందని.. మొదటి భార్య కొడుకును హత్య చేసిన వ్యక్తి
దీంతో విద్యార్థులను ఖాళీ చేయించి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏ పాఠశాలలోనూ బాంబులు లభించలేదని తనిఖీల అనంతరం పోలీసులు వెల్లడించారు. సెర్బియా సహా ఆ ప్రాంతంలోని ఇతర దేశాలలో గతంలో పాఠశాలకు ఇలాంటి బెదిరింపులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ప్రతిసారీ తప్పుగా నిరూపించబడ్డాయి. అయితే, ఇలాంటి బెదిరింపుల అనంతరం మే 3, 4 తేదీల్లో జరిగిన పేలుళ్లలో 10 మంది మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. అనంతరం పాఠశాలలకు భద్రతను పెంచారు.
Bihar Politics: దీరేంద్ర శాస్త్రి బాబా ‘హిందూ రాష్ట్ర’ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ విమర్శలు
సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో మొదటగా కాల్పులు జరిగాయి. 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీని తీసుకొని కాల్పులు జరిపాడు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం, బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా ఉన్న రెండు గ్రామాలలో 20 ఏళ్ల యువకుడు ఆటోమేటిక్ వెపన్‌తో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో సెర్బియా ఒక్కసారి ఉలిక్కి పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ పదివేల ఆందోళన చేశారు. విద్యాశాఖ, ఇంటెలిజెన్స్ మంత్రులు, ముఖ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.