shanghai : షాంఘై‌లో ఆకలి కేకలు.. బాల్కానీల్లోకి వచ్చి గగ్గోలు పెడుతున్న ప్రజలు..

చైనాలో కొవిడ్ విజృంభున కొనసాగుతుంది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే షాంఘై నగరంలో కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలను ....

shanghai : షాంఘై‌లో ఆకలి కేకలు.. బాల్కానీల్లోకి వచ్చి గగ్గోలు పెడుతున్న ప్రజలు..

China

Updated On : April 12, 2022 / 8:37 AM IST

shanghai : చైనాలో కొవిడ్ విజృంభున కొనసాగుతుంది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే షాంఘై నగరంలో కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. షాంఘై నగరం దాదాపు 2.5 కోట్ల జనాభాతో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. ఒమిక్రాన్‌లోని బీఏ.2 అనే వేరియంట్ వైరస్ చైనాలో వేగంగా వ్యాపిస్తోంది. షాంఘై‌ నగరంలో సోమవారం 25,173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 914 మందికి రోగ లక్షణాలు కనిపిస్తున్నాయి. నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తుంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. ఇంట్లో సైతం ఒక్కరూంలో ఇద్దరు ఉండొద్దని, వేరువేరు రూంలలో ఉండాలని, దంపతులు సైతం చుంబనాలకు దూరంగా ఉండాలంటూ అక్కడి అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు.

Shanghai : ఆకలితో అలమటిస్తున్న చైనా ప్రజలు..10 రోజులుగా కఠిన లాక్ డౌన్

వైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలను అధికారులు అమలు చేస్తుండటంతో తినేందుకు తిండికూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. లాక్‌డౌన్ విధించిన మొదట్లో కొంతమందికి ప్రభుత్వం ఆహార పదార్థాలను పంపిణీ చేసినా కొద్దిరోజుల తరువాత అధికారులు పట్టించుకోవటం మానేశారు. దీంతో తినేందుకు ఆహారపదార్థాలు కరువవడంతో స్థానిక ప్రజలు బాల్కానీల్లోకి వచ్చి గగ్గోలు పెడుతున్నారు. నగర ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు అందించాలని షాంఘై మేయర్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అవి క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.

షాంఘైతో పాటు చైనాలోని దాదాపు 23 నగరాలు పాక్షికంగా, పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మరోవైపు కొవిడ్ సోకిన వారితో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వైద్యులు, నర్సులు ఎంతగానో అలసిపోతున్నారు. ఒక ఐసోలేషన్ కేంద్రంలో రోజుల తరబడి అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు కుప్పకూలిపోతున్న దృశ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా కనిపిస్తున్నాయి.