window.adsbygoogle || []).push({});
వ్యక్తి అంగీకారం లేకుండానే చైనాకు చెందిన జెన్‌వా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అతనికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలిస్తోంది. సోషల్ మీడియా సైట్ల నుంచి ప్రముఖుల సమాచారాన్ని గ్రాబ్ చేస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని.. శత్రుదేశానికి చెందిన నిఘా సంస్థలు, భద్రతా ఏజెన్సీలతో పంచుకుంటోంది. ఇదంతా.. భారత ఐటీ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది.

అలాగని ప్రైవసీ చట్టాలు, విదేశీ అధికార పరిధిలో అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే అక్కడి చట్టాలు మన దేశానికి కంటే భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికీ మారవు.



దాదాపు పదేళ్ల నుంచి భారత రాజకీయ నాయకులు, రక్షణ సిబ్బందిని.. చైనా ట్రాక్ చేస్తున్నట్లు తేలింది. ఇప్పటివరకు ఐదుగురు ప్రధానమంత్రులు, 24 మంది సీఎంలు, దాదాపు 350 మంది ఎంపీలపై.. చైనా కంపెనీ గూఢచర్యం చేస్తోంది. ఇండియాపై Hybrid warfare ప్రారంభించేందుకు చైనా ఈ డేటాను ఉపయోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు.



భారత ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించడం, సరిహద్దుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని చైనా ఈ డర్టీ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది.

whatsapp-channel

»» Read Today's Latest International News and Telugu News

10TV Telugu News