ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి తాను అర్హుడిని కాదన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే వాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ఈ బహుమతికి అర్హులేనని అన్నారు. తప్పనిసరిగా కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ వివాదం పరిష్కారం అవ్వాలని ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ లో తెలిపారు. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించి, శాంతికి, మానవ అభివృద్ధికి ఉప ఖండంలో మార్గం సుగుమం చేసే వాళ్లే నోబెల్ శాంతి బహుమతి తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని అన్నారు.
Also Read : లైట్స్ వేయవద్దంటు బీఎస్ఎఫ్ హెచ్చరికలు : చీకట్లో గుజరాత్ గ్రామాలు
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా ఇమ్రాన్ ఖాన్ కృషి చేశారని, శాంతి ప్రక్రియలో భాగంగా భారత పైలట్ ను విడుదల చేసి భాధ్యాతాయుతంగా ప్రవర్తించాడని, అలాంటి ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనంటూ పాక్ మంత్రులు ఓ తీర్మానం చేశారు. పాక్ దిగువ సభలో శనివారం(మార్చి-2,2019) పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Also Read : బీహార్ లో 40 సీట్లు గెలుస్తాం : మోడీని ప్రధానిని చేస్తాం