Elon Musk daughter: నేను ట్రాన్స్‌జెండర్‌ని.. ఈ విషయాన్ని నాన్నకు చెప్పకు: ఎలాన్ మస్క్ కూతురు

చివరకు తన పేరును వివియన్ జెన్నా విల్సన్ గా మార్చుకుంది. అనంతరం తన తండ్రి ఎలాన్ మస్క్ తో ఆమె తన బంధాన్ని తెంచుకుంది.

Elon Musk daughter: నేను ట్రాన్స్‌జెండర్‌ని.. ఈ విషయాన్ని నాన్నకు చెప్పకు: ఎలాన్ మస్క్ కూతురు

Elon Musk

Elon Musk daughter: ‘ నేను ట్రాన్స్‌జెండర్‌ని.. నా పేరును జెన్నాగా మార్చుకున్నాను. ఈ విషయాన్ని నాన్నకు చెప్పకు ’ అంటూ తన ఆంటీకి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూతురు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ (16) గతంలో మెసేజ్ పంపినట్లు తాజాగా తెలిసింది. వాల్టర్ ఐజాక్సన్ అనే వ్యక్తి ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర రాశారు. ఆ పుస్తకం ద్వారా అనేక విషయాలను ఆయన బయటపెట్టారు.

ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. తన జెండర్ మారిపోవడంతో 2021 జూన్‌లో తన పేరును మార్చుకోవడానికి జేవియర్ అలెగ్జాండర్ మస్క్ ప్రయత్నాలు చేసింది. చివరకు తన పేరును వివియన్ జెన్నా విల్సన్ గా మార్చుకుంది. అనంతరం తన తండ్రి ఎలాన్ మస్క్ తో ఆమె తన బంధాన్ని తెంచుకుంది.

ఎలాన్ మస్క్ తీరు ట్రాన్స్‌జెండర్లకు వ్యతిరేకంగా ఉండడమే అందుకు కారణం. తన కూతురితో విడిపోవడమే తాను జీవితంలో అనుభవించిన అతి పెద్ద బాధాకర విషయాల్లో ఒకటని ఎలాన్ మస్క్ కూడా చెప్పారు.

తన కూతురు ట్రాన్స్‌జెండర్‌గా మారడం పట్ల ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు ఆమె చదువుకున్న పాఠశాలే కారణమని, ఆమెకు కమ్యూనిస్టు భావజాలం అంటుకుందని అన్నారు. తన కూతురిని బ్రెయిన్ వాష్ చేశారని చెప్పారు. ధనవంతులు ఎవరూ మంచివారు కాదన్న భావం ఆమెలో పెరిగిపోయిందని అన్నారు.

Mohan Bhagwat: మన దేశం పేరు ఇడియా కాదు, భారత్.. అలాగే పిలవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్