Iceland Volcano Erupts
Iceland : ఐస్‌లాండ్ దేశంలో అగ్నిపర్వతం పేలింది. భూమి కింద శిలాద్రవం మారడంతో నైరుతి ద్వీపకల్పంలో వేలాది చిన్న భూకంపాలు నమోదయ్యాయి. భూకంప సమూహానికి దక్షిణాన ఉన్న ఐస్‌లాండ్‌లో సోమవారం రాత్రి అగ్నిపర్వత విస్ఫోటనం ప్రారంభమైందని ఐస్‌లాండ్ వాతావరణ కార్యాలయం నివేదించింది. రేక్జాన్స్ ద్వీపకల్పంలో విస్ఫోటనం ప్రారంభమైందని ఆ దేశ అధికారులు చెప్పారు. భూకంపాల తర్వాత రాజధానికి దక్షిణంగా ఉన్న హగాఫెల్‌కు దగ్గరగా ఉన్న అగ్నిపర్వతం పేలిందని ఐస్‌లాండ్ అధికారులు చెప్పారు.
ALSO READ : Tamil Nadu rains : తమిళనాడులో భారీవర్షాలు..వరద బీభత్సం
అగ్నిపర్వతం విస్పోటనం పరిమాణం, ఖచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించడానికి కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ బయలుదేరింది. గత నెలలో తీవ్రమైన భూకంపాల తర్వాత ఐస్‌లాండ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందని హై అలర్ట్ చేశారు. రాజధాని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిషింగ్ పోర్ట్ అయిన గ్రిందావిక్‌లో 4,000 మంది నివాసితులను నవంబర్ 11వతేదీన ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ALSO READ : Earthquake : చైనాలో భారీ భూకంపం…86మంది మృతి
ఐస్‌లాండ్ దేశంలో 33 అగ్నిపర్వతాలున్నాయి. మారుమూల జనావాసాలు లేని ప్రాంతాల్లో తరచూ అగ్నిపర్వతాలు పేలుతుండటంతో ఐస్‌లాండ్ ద్వీపకల్ప ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.