Earthquake : చైనాలో భారీ భూకంపం.. 100 మంది పైగా మృతి

చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడంతో 8 మంది మరణించారు.....

Earthquake : చైనాలో భారీ భూకంపం.. 100 మంది పైగా మృతి

Earthquake

Updated On : December 19, 2023 / 10:02 AM IST

Earthquake : చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడంతో 100 మంది పైగా మరణించారు. ఈ భూకంపం వల్ల 400 మంది వరకు గాయపడ్డారు. గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా పలు భవనాలు కుప్పకూలిపోయాయి. దీనివల్ల భారీ నష్టం సంభవించింది. ప్రజలు భద్రత కోసం వీధిల్లోకి వచ్చారు. చైనా అధికారులు మంగళవారం తెల్లవారుజామున సహాయక చర్యలు చేపట్టారు.

ALSO READ : CM Jagan : ఆ ఐదుగురికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలలో పడిపోయిన పైకప్పులు, భవన శిధిలాలు కనిపించాయి. చైనాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భారీ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం సంభవించిన వెంటనే చైనా అత్యవసర ప్రతిస్పందన అధికారులు ఆ ప్రాంతానికి అత్యవసర నిర్వహణ, అగ్నిమాపక విభాగాలను పంపారు.

ALSO READ : Junior Doctors : నిర‌వ‌ధిక స‌మ్మెకు జూనియ‌ర్ డాక్ట‌ర్ల పిలుపు

భూకంపం ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌకు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. చైనా దేశంలో భూకంపాలు సర్వసాధారణం. ఆగస్టు నెలలో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో 23 మంది గాయపడ్డారు. పలు భవనాలు కుప్పకూలిపోయాయి.