అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటనతో అమెరికా – ఇరాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉంది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్‌ను అమెరికా మట్టుబట్టిన సంగతి తెలిసిందే.
హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఆ దేశం మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ జనాభ 80 లక్షలు. దేశ జనాభా ఆధారంగా..ప్రతొక్కరూ ఒక్క డాలర్ సమకూర్చాలని, ట్రంప్ తల నరికి తెచ్చిన వారికి రివార్డు ప్రకటించినట్లు..mirror.co.uk రిపోర్టు వెల్లడించింది.
ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై 2020, జనవరి 03వ తేదీ శుక్రవారం అమెరికా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. టాప్ సైనిక కమాండ్ జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండీస్‌లు చనిపోయారు. ఈ ఘటనతో ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ప్రతిగా ఇరాన్..దాడులతో విజృంభిస్తోంది. ఇరాన్ తమపై దాడికి పాల్పడితే..మాత్రం..మునుపెన్నడు లేనిస్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అక్కడ 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను తాము గుర్తించడం జరిగిందని, దాడి చేస్తే..ఆ ప్రాంతాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఇరాన్ ఎంపీ అబోల్ఫాజ్ తీవ్రంగా స్పందించారు. వైట్ హౌస్‌పై దాడి చేయగలమని మిర్రర్.కో.యుకే..ఉటంకిస్తూ వెల్లడించారు. తమకూ శక్తి ఉందని తగిన సమయంలో తాము ప్రతిస్పందిస్తామని తెలిపారు. మరి తాజాగా ఇరాన్ చేసిన ప్రకటనతో ెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.