Manchineel : ఆ చెట్టు క్రింద నిలబడితే అనారోగ్యం…కాయలు తింటే మరణం

ఆ చెట్టు పేరు మన్షినీల్.. ఇది చాలా విషపూరితమైంది. చెట్టుకు అత్యంత సమీపంగా వెళ్ళినా సరే అనారోగ్యం పాలు కావాల్సిందే. అందుకే ఈ చెట్టు జోలికి వెళ్లేందుకు ఎవరు సాహసించరు.

Manchineel : ఆ చెట్టు క్రింద నిలబడితే అనారోగ్యం…కాయలు తింటే మరణం

Manchineel

Updated On : November 4, 2021 / 1:30 PM IST

Manchineel : ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. కొన్ని చెట్లు మనిషికి ప్రాణావాయువుని అందిస్తాయి. మానిషి బ్రకటానికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి. ఆరోగ్యానికి కావాల్సిన మూలికలుగా ఉపయోగపడతాయి. అయితే ఫ్లోరిడా, కరేబియన్ సముద్ర తీరాల్లో ఉప్పునీటి చిత్తడి నేలల్లో కనిపిస్తుంది. సముద్రం నుండి వచ్చే బలమైన గాలులను అడ్డుకోవటంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. సముద్రకోతలను నివారించటంలో తోడ్పడుతుంది.

చూడటానికి ముచ్చటగా కనిపించే ఓ చెట్టు మాత్రం ఆరోగ్యాన్ని హరించటమే కాదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదరకమైన చెట్టు. పొరపాటున ఆచెట్టు కాయలు తింటే ప్రాణాలనే బలితీసుకుంటుంది. అందుకే ఈ చెట్టుకాయలను లిటిల్ యాపిల్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. పండ్లు యాపిల్ ను పోలి ఉంటాయి. చెట్టును కాల్చడం వల్ల పొగ కళ్లకు చేరితే కంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

ఆ చెట్టు పేరు మన్షినీల్.. ఇది చాలా విషపూరితమైంది. చెట్టుకు అత్యంత సమీపంగా వెళ్ళినా సరే అనారోగ్యం పాలు కావాల్సిందే. అందుకే ఈ చెట్టు జోలికి వెళ్లేందుకు ఎవరు సాహసించరు. కరేబియన్ దీవుల్లో ఈ చెట్ల వద్ద డేంజర్ బోర్డులు కనిపిస్తుంటాయి. ఈ చెట్ల క్రిందకు ఎవరు రావోద్దు.. చెట్ల కాయలను ఎవరు తినొద్దంటూ హెచ్చరిక బోర్డులను అక్కడి వారు ఏర్పాటు చేశారు.

నికోలా హెచ్ స్ట్రిక్‌ల్యాండ్ అనే శాస్త్రవేత్త తెలిపిన వివరాల ప్రకారం.. ఒకసారి అతను, అతని స్నేహితులు కొందరు కరేబియన్ దీవి టొబాగో బీచ్‌కి వెళ్ళిన సందర్భంలో మన్షినీల్ చెట్టుకు కాసిన చిన్నసైజులో ఉండే లిటిల్ యాపిల్ పండును తిన్నాడు. పండు తిన్న కొద్దిసేపటికే శరీరంలో మంటలు, వాపులు మొదలయ్యాయి. అయితే, వెంటనే చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.

మన్షినీల్ చెట్టు దాదాపు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. చెట్టు ఆకులు మెరుపుతో కూడి అండాకారంలో ఉంటాయి. కరేబియన్ ప్రాంతానికి చెందిన చెక్కపనిచేసే వారు ఈ చెట్టు కలపను ఫర్నిచర్ తయారు చేయడానికి వాడతారు. చెట్టును నరికేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫర్నిచర్ తయారు చేయడానికి ముందు కలపను రోజుల తరబడి ఎండలో ఆరబెడతారు, ఇలా చేయటం వల్ల ఆ కలపలోని విషరసం తొలగిపోతుంది.