Imran Khan : జైలులో ఇమ్రాన్‌ఖాన్‌కు నెయ్యితో దేశీ చికెన్, మటన్ భోజనం

అటాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నెయ్యితో వండిన దేశీ చికెన్, మటన్ వడ్డిస్తున్నామని జైలు అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ అయినందువల్ల ఆయన ప్రొఫైల్ స్థితిని పరిగణనలోకి తీసుకుని అటాక్ జైలులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జైలు అధికారులు పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు....

Imran Khan : జైలులో ఇమ్రాన్‌ఖాన్‌కు నెయ్యితో దేశీ చికెన్, మటన్ భోజనం

Imran Khan

Imran Khan : అటాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నెయ్యితో వండిన దేశీ చికెన్, మటన్ వడ్డిస్తున్నామని జైలు అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ అయినందువల్ల ఆయన ప్రొఫైల్ స్థితిని పరిగణనలోకి తీసుకుని అటాక్ జైలులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జైలు అధికారులు పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. (Imran Khan being served desi ghee meals) తోషాఖానా కేసులో పాకిస్థాన్ జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5వతేదీన ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

Kashmir : అందాల కశ్మీరులోయలో మిస్ వరల్డ్, సుందరాంగుల పర్యటన

మాజీ ప్రధాని జీవన స్థితిగతుల నివేదికను సుప్రీంకోర్టు కోరిన తర్వాత జైలు పరిపాలన తరపున అటార్నీ జనరల్ కార్యాలయం సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జైలులో అత్యంత సురక్షితమైన హై అబ్జర్వేషన్ బ్లాక్‌ నంబరు2లో ఇమ్రాన్ ఖాన్ ను ఉంచారు. జైలులో సిమెంటుతో ఫ్లోరింగ్ వేసి, సీలింగ్ ఫ్యాన్‌ను అమర్చామని జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. జైలులో మాజీ ప్రధాని కోసం వాష్ రూం గదిని విస్తరించి, దానికి ఫైబర్ డోర్ కూడా ఏర్పాటు చేశారు.

Indonesia : ఇండోనేషియా బాలి సముద్రంలో భారీ భూకంపం… సునామీ హెచ్చరిక లేదు

కొత్త టాయిలెట్ సీటు, షవర్, టిష్యూ స్టాండ్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాప్‌ను ఏర్పాటు చేశారు. అభ్యంగన స్నానం, ఫేస్ వాష్ కోసం గ్లాస్‌తో కూడిన వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. పదవీచ్యుతుడైన ప్రధాని జైలులో సురక్షితంగా ఉండేలా చూసేందుకు పంజాబ్‌కు చెందిన కనీసం 53 మంది జైలు సిబ్బందిని తాత్కాలికంగా మోహరించారు. శిక్ష పడిన ఖైదీకి మంచం, నాలుగు దిండ్లు, టేబుల్, కుర్చీ, ప్రార్థన చాప, ఎయిర్ కూలర్ అందించారు. వార్తాపత్రికలతో పాటు ఇస్లామిక్ చరిత్ర పుస్తకాలు, పవిత్ర ఖురాన్ అందించామని నివేదిక పేర్కొంది.