ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ కు బానిసా ?

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 02:24 PM IST
ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ కు బానిసా ?

Updated On : November 4, 2020 / 2:28 PM IST

Imran Khan consumed cocaine – Sarfraz : నీతి నిజాయితీ అని బిల్డప్ ఇచ్చే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్‌కు బానిసా..? క్రికెట్ ఆడే రోజుల్లో ఆయన మాదక ద్రవ్యాలు సేవించే వాడా? గంజాయి తాగకపోతే రోజు గడవదా..? అంటే అవుననే సమాధానం ఇచ్చాడు ఇమ్రాన్‌ సహచర క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్‌. ఇమ్రాన్ ఖాన్‌పై సర్ఫరాజ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.



ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న ప్రతిపక్షాల దాడులను ఎదుర్కోలేక సతమతమవుతున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఇమ్రాన్‌ఖాన్ డ్రగ్స్‌కు బానిసయ్యాడంటూ ఆయన సహచర క్రికెటర్‌ సర్ఫరాజ్ నవాజ్.. సంచలన ఆరోపణలు చేశారు. 1987లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌ తర్వాత.. ఇమ్రాన్ ఖాన్ తన ఇంటికి వచ్చాడని.. భోజనం చేశాక డ్రగ్స్‌ సేవించడన్నారు సర్ఫరాజ్‌.



గంజాయితో పాటు కొకైన్‌ను పీల్చడం ఆయనకు అలవాటుందన్నారు. లండన్‌లో ఇమ్రాన్ చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోవడం తాను కళ్లారూ చూశానని చెప్పారు. తాను చెప్పేది తప్పని తేలితే.. దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు సర్ఫరాజ్. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ గనక ఖండించాలనుకుంటే తన ఎదురుగా వచ్చి చెప్పాలన్నారు.



ఇమ్రాన్ ఖాన్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయనపై చాలా మంది ఇలాంటి కామెంట్స్‌ చేశారు. ఇమ్రాన్ మాజీ భార్య రెహ‌మ్ ఖాన్‌ కూడా త‌న ఆత్మక‌థ లో తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేశారు. ఇమ్రాన్ డ్రగ్స్‌కు బానిస అని.. పెద్ద అబ‌ద్దాల కోరు అని రెహ‌మ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.



ఇప్పటికే ఉగ్రవాదం, కుప్పకూలిన పాక్‌ ఆర్థిక వ్యవస్థతో సతమమతమవుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌.. సర్ఫరాజ్‌ నవాజ్‌ చేసిన వ్యాఖ్యలతో మరింత ఇరకాటంలో పడ్డారు. ఆయనపై క్రికెట్ ప్రపంచంతో పాటు రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డ్రగ్స్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ – సర్ఫరాజ్‌ నవాజ్‌ ఆరోపణలకు స్పందిస్తాడా.. లేదా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.