Rare coin Rs 2.6 crore : రూ.2.6 కోట్లు పలికిన 16వ శతాబ్దం నాటి నాణెం..

16వ శతాబ్దం నాటి అరుదైన నాణెం రూ.2.6 కోట్లు పలికింది. ఈ నాణెం చాలా ప్రత్యేకమైనది.. ఆ నాణెం మీద ఉన్న అక్షరాలక అర్థం ఏంటంటే..

Rare Coin Minted In 1652 Sold To For A Whopping Rs 2.6 Crore

Rare coin Rs 2.6 crore : పాత కరెన్సీ నోట్లు దాచుకుంటే చినిగిపోతాయి తప్ప మరే ఉపయోగం ఉండదు వాటి వల్ల. కానీ నాణాలకు అలా కాదు..అవి ఎంత పాతవి అయితే అంత డిమాండ్ ఉంటుంది. అటువంటి నాణాలు వేలం వేయటం అవి భారీ ధరకు అమ్ముడుపోవటం జరుగుతుంటాయి. అలా వంద‌ల ఏళ్ల నాటివైతే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అలా వందల ఏళ్ల క్రితం తయారు చేసిన ఓ అరుదైన నాణేన్ని వేలం వేయగా ఏకంగా కోట్ల ధర పలికింది.

Read more : గొర్రె ఖరీదు రూ.3 కోట్లు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు

అది షిల్లింగ్ క‌రెన్సీకి చెందిన‌ సిల్వ‌ర్ కాయిన్. ఈ నాణాన్ని న్యూ ఇంగ్లండ్‌లోని మింట్‌లో 1652లో త‌యారు చేసినది. ఆనాణేనికి ఒక వైపు NE అనే అక్షరాలు.. ఉంటాయి. NE అంటే న్యూ ఇంగ్లండ్ (New England)అని అర్థం. మ‌రోవైపు.. రోమ‌న్ న్యుమ‌ర‌ల్ XII(Roman numeral XII) అని ఉంటుంది. షిల్లింగ్ క‌రెన్సీలో XII అంటే 12 పెన్నీలు అని అర్థం. ఈ అరుదైనా నానాన్ని గత శుక్రవారం (నవంబర్ 26,2021) వేలంలో వేయ‌గా.. యూఎస్‌కు చెందిన ఓ ఆన్‌లైన్ బిడ్డ‌ర్ 3,50,000 డాల‌ర్ల‌ను కొనేశాడు. అంటే భారత క‌రెన్సీలో రూ.2.6 కోట్లు పలికింది.

Read more :  Bbaahubali Bull :ఈ బాహుబలి దున్న‌పోతు వెరీ రిచ్..ప్రీమియం స్కాచ్, సండే స్విమ్మింగ్,కిలోల కొద్దీ డ్రైఫ్రూట్..

ఈ నాణానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. న్యూఇంగ్లండ్‌లో ముద్రించిన మొద‌టి కాయిన్ అది. 1652కు ముందు న్యూఇంగ్లండ్‌లో నెద‌ర్లాండ్స్, స్పానిస సంస్థానం, ఇంగ్లండ్‌కు సంబంధించిన కాయిన్స్‌నే అధికారికంగా ఉప‌యోగించేవారు. 1652లో తొలిసారి న్యూఇంగ్లండ్ సొంత కాయిన్స్‌ను ముద్రించ‌డం ప్రారంభించింది. ఈ నాణెం అంచనాలకు మించి అమ్ముడైందని కాయిన్ స్పెషలిస్ట్ జేమ్స్ మోర్టన్ తెలిపారు.

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే