భారత్ కంటే ముందే టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన దేశాలు ఇవే!

  • Published By: vamsi ,Published On : June 30, 2020 / 01:46 PM IST
భారత్ కంటే ముందే టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన దేశాలు ఇవే!

Updated On : June 30, 2020 / 3:02 PM IST

చైనాతో కొనసాగుతున్న వివాదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనాపై ఆర్థిక చర్యలను ప్రారంభించింది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 59 చైనా యాప్2లను, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ నిషేధించింది. వాటిలో టిక్ టాక్ కూడా ఉంది.

ఈ యాప్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. టిక్‌టాక్‌లో సాధారణ ప్రజలు మాత్రమే కాదు. చాలా మంది సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా ఉన్నారు. అయితే టిక్ టాక్ కొంతకాలంగా చాలా వివాదాలలో కొనసాగుతోంది.

అయితే, టిక్ టాక్ నిషేధించిన మొదటి దేశం భారత్ కాదు. ఈ యాప్ ఇప్పటికే చాలా దేశాలలో నిషేధించబడింది. ఏప్రిల్ 2019లో అశ్లీల విషయాలు మరియు లైంగిక హింసకు సంబంధించి వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్‌ను నిషేధించింది. అయితే, బైట్‌డాన్స్ తరువాత కోర్టులో ప్రజల ఉద్యోగాలను ఉదహరించింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ ప్లాట్‌ఫామ్‌లో పిల్లలు, మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉండకూడదనే షరతుతో యాప్ నిషేధాన్ని ఎత్తివేసింది.

పిల్లల లైంగిక హింస కేసులో టిక్ టాక్‌కు అమెరికా జరిమానా విధించింది. యుఎస్‌లో, 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఖాతా గురించి టిక్‌టాక్‌ను ప్రశ్నించారు. ఫిబ్రవరి 2019 లో ఆరోపణలు రుజువు అయిన తరువాత, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ టికెటాక్‌కు 75.7బిలియన్ జరిమానా విధించింది.

ఇండోనేషియా, బంగ్లాదేశ్‌లలో కూడా నిషేధం:
ఇండోనేషియా మరియు బంగ్లాదేశ్‌లలో కూడా టిక్‌టాక్‌ను భారత్ కంటే ముందు నిషేధించాయి. ప్రతికూల కంటెంట్ కారణంగా 2018 సంవత్సరంలో ఇండోనేషియా టిక్‌టాక్‌ను నిషేధించింది. అయితే, మూడు వారాల తరువాత నిషేధం ఎత్తివేయబడింది. ఇదే కాకుండా, బంగ్లాదేశ్‌లో కూడా టిక్‌టాక్ అందుబాటులో లేదు. 2019 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఈ చర్య తీసుకుంది.

Read:సెలబ్రిటీల టిక్‌టాక్ అకౌంట్లపై నీలి నీడలు..