India Conditions To Pakistan: హాట్ లైన్ చర్చలు.. పాకిస్తాన్ ముందు భారత్ పెట్టిన కండీషన్స్ ఇవే..!
తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపేయాలని పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరికలు జారీ చేయనుంది.

India Conditions To Pakistan: కాసేపట్లో భారత్, పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాలకు చెందిన డీజీఎంవోలు హాట్ లైన్ లో చర్చించనున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాక్ ను సూటిగా ప్రశ్నించనుంది భారత్. తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపేయాలని పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరికలు జారీ చేయనుంది. పాక్ లో ఉంటున్న కీలక ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేయనుంది. అలాగే పీవోకేను ఇండియాకు అప్పగించాలన్న డిమాండ్ ను కూడా పాక్ ముందు పెట్టనుంది.
భారత్ కండీషన్స్ ఇవే..
పీవోకేను భారత్ కు అప్పగించాలి
కీలక ఉగ్రవాదులను అప్పగించాలి
కాల్పుల విరమణ ఉల్లంఘించకూడదు
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు సహించం
ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఏప్రిల్ 22న ముష్కరులు మారణహోమం సృష్టించారు. టూరిస్టులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 26మంది మరణించారు. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోయిన భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకార చర్యలకు దిగింది.
పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. భారత్ దాడితో పాక్ ప్రతీకార దాడులకు దిగింది. భారత సైనిక స్థావరాలు, జనావాసాలు లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్ దాడులకు తెగబడింది. భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. కాల్పులు విరమణ ప్రకటించిన తర్వాత కూడా పాక్ బరి తెగించింది. భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది.