Sri lanka Rrefuelling of China warships : చైనా యుద్ధనౌకలకు సీక్రెట్‌గా ఇంధనాన్ని నింపుతున్న శ్రీలంక .. మండిపడుతున్న భారత్
చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపుతోంది. దీనిపై భారత్ శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sri lanka Rrefuelling of China warships
India frowns at Sri lanka for mid Sea refuelling of Chinese warships : చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపుతోంది. దీనిపై భారత్ శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సయమంలో భారత్ లంకకు అండగా నిలబడింది. ఎంతో సహాయం చేసి చేదోడు వాదోడుగా నిలిచింది. కానీ శ్రీలంకకు భారత్ పై గౌరవాభిమానాలు ఉన్నా మరోవైపు చైనా చేసే ఒత్తిడులకు లొంగిపోతోంది. చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’.. శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టులో నిలపటం వంటి అంశాలపై భారత్ శ్రీలంకకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్ తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరింది. ఈక్రమంలో శ్రీలంక చైనా యుద్ధ నౌకలకు రహస్యంగా ఇంధన నింపుతున్న విషయంపై మరోసారి శ్రీలంకపై కన్నెర్రచేసింది భారత్.
చైనా నౌకలకు ఇంధనం నింపడం.. డాకింగ్ కోసం శ్రీలంక పారదర్శక ప్రామాణిక ఆపరేషన్ విధానాలను (ఎస్‌వోపీ)లు రూపొందించాలని భారత్ గతంలో సూచించింది. అలాగే శ్రీలంక నుంచి చైనా లీజుకు తీసుకున్న హంబన్‌తోట నౌకాశ్రయం, కొలంబో పోర్ట్‌లలో చైనా యుద్ధ నౌకలను డాక్ చేయడానికి లేదా ఇంధనం నింపుకోవడానికి అనుమతించవద్దని సూచించింది. వీటిపై శ్రీలంక భారత్ కు ఎదురు చెప్పకపోయినా చైనా ఒత్తిడులకు తల ఒగ్గుతోంది. దీంట్లో భాగంగానే చైనా యుద్ధ నౌకలకు ఇంధనం నింపటం వంటివి చేయటం.
Chinese Ship: శ్రీలంక పోర్టుకు చేరుకున్న చైనా నిఘా నౌక.. భారత ఆందోళన బేఖాతరు
సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక ట్యాంకర్లు రహస్యంగా ఇంధనం నింపుతున్నాయి. చైనా లీజ్‌కు తీసుకున్న హంబన్‌తోట నౌకాశ్రయం నుంచి ఇంధనాన్ని శ్రీలంక ట్యాంకర్లలో లోడ్ చేస్తున్నాయి. సముద్రంలో ఉన్న చైనా యుద్ధ నౌకలకు రహస్యంగా ఇంధనం నింపుతున్నాయి. ఈ విషయం భారత్ దృష్టికి రావడంతో శ్రీలంక తీరుపై మండిపడింది.
కాగా..చైనాకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ వాంగ్ యువాన్ 5ను హంబన్‌తోట పోర్ట్ వద్ద డాక్ చేయడానికి రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. దీనిపై భారత్, అమెరికా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా యుద్ధ, వ్యూహాత్మక నిఘా నౌకలను శ్రీలంక నౌకాశ్రయాలలో డాకింగ్ చేయడానికి అనుమతించవద్దని భారత్, అమెరికా దేశాలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. దీంతో తమ నౌకాశ్రయాల్లోకి చైనా యుద్ధ నౌకలను శ్రీలంక అనుమతించడం లేదు. కానీ సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న చైనా యుద్ధ నౌకలకు ట్యాంకర్ల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేసి రహస్యంగా శ్రీలంక నింపుతోంది. దీంతో భారత్ మరోసారి శ్రీలంకపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.ఇటువంటివి మానుకోవాలని..శ్రీలంకకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే భారత్ విషయంలో ఇటువంటివి మానుకోవాలని కోరుతోంది.