India Japan Summit : భారత్‌లో.. జపాన్ రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు

భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది జపాన్. వచ్చే ఐదేళ్లలో ఏకంగా రూ.3.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. (India Japan Summit)

India Japan Summit : భారత్‌లో.. జపాన్ రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు

India Japan Summit

Updated On : March 19, 2022 / 11:23 PM IST

India Japan Summit : భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది జపాన్. వచ్చే ఐదేళ్లలో ఏకంగా రూ.3.2లక్షల కోట్ల పెట్టుబడులు జపాన్ పెట్టనుంది. భారత్, జపాన్ ప్రధానుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఐదేళ్లలో జపాన్.. భారత్ లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టబడులను పెడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్-జపాన్ భాగస్వామ్యం మరింత బలోపేతం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచ స్థాయిలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం గురించి ఇరుదేశాలు ప్రకటించగా.. 2 దేశాల మొత్తం 6 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రెండు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా 14వ భారత్​- జపాన్​ ద్వైపాక్షిక సదస్సులో ఫుమియో కిషిదా, మోదీ శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ ​హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడంతో పాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు వీలుగా ఆరు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.(India Japan Summit)

Japan – India: జపాన్ ప్రధానితో భారత ప్రధాని మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

భేటీ అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్-జపాన్ బంధాలను మరింతగా బలోపేతం కావడం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర గురించి చర్చించామని జపాన్ ప్రధాని కిషిదా ఉన్నారు. రష్యా చర్యలు అంతర్జాతీయ నిబంధనలను కాలరాసేవిగా ఉన్నాయని, ఇది తీవ్రమైన అంశంగా అభివర్ణించారు.

Japan PM Fumio Kishida : ప్ర‌ధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిడా

భారత్ ​పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3.40 గంటలకు భారత్​ చేరుకున్నారు కిషిదా. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​.. కిషిదాకు ఘన స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కిషిదా తిరుగు ప్రయాణం కానున్నారు. భారత పర్యటన అనంతరం కంబోడియా వెళ్లనున్నారు.

సదస్సులో భారత్‌, జపాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చలు జరిపారు. మోదీ, కిషిడాల మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ అంశాలు కూడా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.

కాగా భారత్, జపాన్ ప్రధానులు ఢిల్లీలో సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్‌, జపాన్‌ మధ్య చివరిసారి 2018లో టోక్యోలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2021 అక్టోబర్‌లో ప్రధానమంత్రి కిషిడా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయ్యాయి.