చేతులెత్తేసిన పాక్.. మాకొద్దు యుద్ధం.. శాంతి కావాలంటున్న దాయాది

చేతులెత్తేసిన పాక్.. మాకొద్దు యుద్ధం.. శాంతి కావాలంటున్న దాయాది

Updated On : May 9, 2025 / 12:06 AM IST

రెండు రోజులు.. జస్ట్ రెండు రోజుల్లోనే పాక్ దెబ్బకు దిగొచ్చింది. వార్ వస్తే మేం ఖాళీగా కూచ్చోం.. మా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి.. అవి భారత్ వైపే ఎక్కుపెట్టి ఉన్నాయని చెప్పిన పాకిస్తాన్ తోకముడించింది. రెండు రోజులు భారత్ చేస్తున్న దాడికి తట్టుకోలేక చేతులెత్తేసింది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, శాంతిని కోరుకుంటున్నామని పాకిస్తాన్ సైన్యం చెప్పినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలపై భారత సైన్యం విరుచుకుపడుతోంది. లాహోర్, సియాల్ కోట్, ఇస్లామాబాద్ సహా మరికొన్ని నగరాలపై భీకరంగా దాడులు చేస్తోంది. సర్దోగా, ఫైసలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లో వాయుసేన హెచ్చరిక కేంద్రంపై ఎటాక్ చేసింది. ఓ వైపు పాకిస్థాన్ మిస్సైల్స్ ను ఎదుర్కొంటూ.. వాటిని తునాతునకలు చేస్తోంది. మరోవైపు శత్రుదేశంపై డ్రోన్లతో విరుచుకుపడోతంది. దీంతో పాకిస్తాన్ కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తోంది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని సైన్యం ప్రకటించింది.

ఇక భారత్ , పాక్ మధ్య వార్ మొదలు కావడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. అమెరికా రంగంలోకి దిగింది. పాకిస్తాన్ కి ఇప్పటికే క్లాస్ పీకిన అమెరికా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసింది. అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ జైశంకర్ కు కాల్ చేశారు. పాకిస్థాన్ చేస్తున్న దురాగతాలను జైశంకర్ ఆయనకు వివరించారు. తాము వెనక్కి తగ్గే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

ఇక మరికొన్ని ప్రపంచదేశాలు కూడా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రంగంలోకి దిగాయి. అమెరికాతో పాటు రష్యా, చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు భారత్ తో చర్చలు జరిపి దౌత్యపరంగా వివాదానికి పరిష్కారం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.